రౌడీ టైటిల్‌ను వదిలేందుకు రెడీ అయిన పూరీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.కాగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండగా, ఇందులో విజయ్ అదిరిపోయే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 Puri Jagannadh Vijay Devarakonda-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన అపఫీషియల్ టైటిల్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా తాజాగా ఈ విషయంపై చిత్ర నిర్మాత ఛార్మీ ఓ క్లారిటీ ఇచ్చింది.

 Puri Jagannadh Vijay Devarakonda-రౌడీ టైటిల్‌ను వదిలేందుకు రెడీ అయిన పూరీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు, త్వరలోనే దీన్ని అనౌన్స్ చేయబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.అయితే ఫైటర్ అనే టైటిల్ కాకుండా మరి ఏ టైటిల్ ఈ సినిమాకు పెట్టారనే విషయంపై మాత్రం ఛార్మీ క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో ఈ సినిమా టైటిల్‌పై మళ్లీ సస్పెన్స్ మొదలైంది.ఇక ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండగా, విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మరి ఈ సినిమాకు పూరీ ఎలాంటి టైటిల్‌ను పెట్టాడో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

#Puri Jagannadh #Liger #Fighter #Ananya Pandey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు