బాలీవుడ్‌లోనే పాతుకుపోతున్న పూరీ.. మరి తెలుగు మాట ఏమిటయ్యా?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఒక్క సినిమాతో పూరీ గతకొంత కాలంగా కోల్పోయిన క్రేజ్‌ను తిరిగి రాబట్టుకున్నాడు.

 Puri Jagannadh To Make Next Two Movies In Bollywood-TeluguStop.com

ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంలో పూరీ తనదైన మార్క్‌ను చూపించాడు.ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్.

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నాడు పూరీ.కాగా ఈ సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Puri Jagannadh To Make Next Two Movies In Bollywood-బాలీవుడ్‌లోనే పాతుకుపోతున్న పూరీ.. మరి తెలుగు మాట ఏమిటయ్యా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.అయితే పూరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానంతో పూర్తిగా ఇంప్రెస్ అయిన కరణ్ జోహర్, పూరీతో ఓ స్టన్నింగ్ డీల్ కుదుర్చుకున్నాడు.

తన నెక్ట్స్ రెండు చిత్రాలను బాలీవుడ్ హీరోలతో చేయాల్సిందిగా పూరీతో సైన్ చేయించుకున్నాడు ఈ టాప్ డైరెక్టర్.అదిరిపోయే ఆఫర్ కావడంతో పూరీ కూడా ఈ ఒప్పందానికి రెడీ అయ్యాడు.

అయితే విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న సినిమా తెలుగు ఆడియెన్స్‌కు ఇప్పటికే తెలిసిన విషయం కాబట్టి, ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులు అంటున్నారు.మరి పూరీ బాలీవుడ్ స్టార్స్‌తో తీయబోయే సినిమాలను తెలుగులో నేరుగా రిలీజ్ చేస్తారా లేక వేరే తెలుగు హీరోలతో ఆ సినిమాలను చేసి రిలీజ్ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

#Fighter #Puri Jagannadh #Karan Johar #Liger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు