పాత కథలు చెత్త బుట్టలో వేయమంటున్న పూరి

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్.యూత్ కి ఎక్కువగా ఎలాంటి కథలు కావాలో వాటినే తెరపై ఆవిష్కరించి హిట్స్ కొట్టడంలో పూరి సిద్ధహస్తుడు.

 Puri Jagannadh Suggests The Directors For Stories, Tollywood, Bollywood, Univers-TeluguStop.com

ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడుగా పూరికి బ్రాండ్ ఇమేజ్ ఉంది.అయితే అతని కథలు అన్ని కూడా చుట్టూ తిరిగి మాఫియాకి లింక్ అవుతాయి.

ఈ జోనర్ ని ఇప్పటికి పూరి తన సినిమాలలో కొనసాగిస్తున్నాడు.హాలీవుడ్ గాడ్ ఫాదర్ సినిమా ప్రభావం పూరి సినిమాలపై ఉంటుందని అతని కథలే చెబుతాయి.

అలాగే ట్రెండ్ ని ముందుగా పసిగట్టి అందుకు తగ్గట్లు హీరో పాత్రలని పూరి డిజైన్ చేస్తూ ఉంటాడు.అయితే ఇప్పుడు పూరి సౌత్ దర్శకులు, రచయితలు అందరికి ఒక సలహా ఇస్తున్నాడు.

లాక్ డౌన్ ముందు రాసుకున్న కథలన్నింటిని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయాలని చెబుతున్నాడు.

ఈ ఆరు నెలల లాక్ డౌన్ కాలంలో ఆడియన్స్ దృక్పథం పూర్తిగా మారిపోయిందని, వరల్డ్ సినిమా చూడటానికి జనం అలవాటు పడ్డారని పూరి చెప్పుకొచ్చాడు.

ఒకప్పుడు 20 శాతం మాత్రమే వరల్డ్ సినిమాని ఇష్టపడితే లాక్ డౌన్ కారణంగా ఆ రేషియో 50 శాతం అయ్యిందని అన్నాడు.ఈ నేపధ్యంలో రొటీన్ కమర్షియల్ ఫార్ములా కథలు అంటూ కూర్చుంటే జనం చూడరని, కచ్చితంగా యూనివర్శల్ కాన్సెప్ట్ కి కనెక్ట్ అవుతారని, అలాంటి కథలనే సిద్ధం చేసుకోవాలని సలహా ఇస్తున్నాడు.

ప్రేక్షకులు సినిమాలని చూసే ఆలోచన మారిందని, దానికి తగ్గట్లే సినిమా కథలు ఉంటేనే ఆదరిస్తారని క్లారిటీ ఇచ్చాడు.టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పెద్ద సినిమాల వరుస చూస్తూ ఉంటే పూరి మాటలు నిజమనే అనిపిస్తున్నాయి.

స్టార్ దర్శకులు అందరూ కూడా మేగ్జిమమ్ యూనివర్శల్ సబ్జెక్ట్ లతోనే కథలు సిద్ధం చేసుకొని సినిమాలు చేస్తున్నారు.వాటికే కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తున్నారు.అలాగే చిన్న సినిమాలు వచ్చేసరికి పవర్ ఫుల్, డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇకపై తెలుగు సినిమాలు కథ, కథనాలు మారబోతున్నాయి అని పూరి మాటల బట్టి తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube