ఆ బ్యూటీ కోసం అల్లాడిపోతున్న పూరీ.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్‌లో క్రేజీ సినిమాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నారు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పూరీ ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ పూరితో రొమాంటిక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Puri Jagannadh Still Trying To Convince Janhvi Kapoor-TeluguStop.com

ఈ సినిమా తరువాత పూరి ప్రెస్టీజియస్‌ మూవీగా ఫైటర్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తుండగా హీరోయిన్ కోసం పూరి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను సంప్రదించాడు.

అయితే ఆమె ఈ సినిమాకు నో చెప్పడంతో మరే హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు.కానీ పూరి మాత్రం ఈ సినిమాలో జాన్వీ కపూర్‌నే నటింపజేయాలని చూస్తున్నాడు.

దీనికోసం ఆమె తండ్రి బోనీ కపూర్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడట పూరీ.

ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ మాత్రమే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని పూరి ఆలోచిస్తున్నాడు.

అంతేగాక విజయ్ దేవరకొండ సరసన కూడా ఈ బ్యూటీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని పూరి భావిస్తున్నాడు.దీంతో ఈ సినిమా కోసం జాన్వీ కపూర్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేయాలని పట్టు వదలడం లేదు పూరి.

మరి ఈ సినిమాలో చివరకు ఎవరు సెట్ అవుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube