కన్నీళ్లు పెట్టుకున్న పూరీ జగన్నాథ్.. కారణమేమిటంటే..?

గడిచిన కొన్ని రోజుల నుంచి పూరీ మ్యూజింగ్స్ ద్వారా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్న పూరీ జగన్నాథ్ తాజాగా ‘బ్లైండ్‌’ అనే టాపిక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.డిగ్రీ చదివే సమయంలో తన జీవితంలో జరిగిన విషయాల గురించి పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

 Puri Jagannadh Shocking Comments About Blind People-TeluguStop.com

సాధారణ మనుషులతో పోలిస్తే బ్లైండ్ పీపుల్ కు ఉండే శక్తి గురించి పూరీ వివరించారు.తాను డిగ్రీ చదివే సమయంలో తన హాస్టల్ లోని గది పక్కనే ఇద్దరు డిగ్రీ చదివే కుర్రాళ్లు ఉండేవారని పూరీ చెప్పారు.

తనకు సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేదని.రోజూ ఫస్ట్ షో లేదా సెకండ్ షో చూసి రూమ్ కు వెళ్లేవాన్నని ఒకరోజు రాత్రి రూమ్ కు వెళుతుండగా వాళ్లిద్దరూ బయటే కూర్చుని వెయిట్ చేస్తున్నారని అన్నారు.

 Puri Jagannadh Shocking Comments About Blind People-కన్నీళ్లు పెట్టుకున్న పూరీ జగన్నాథ్.. కారణమేమిటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను వాళ్లను ఇంత రాత్రైనా ఎందుకు పడుకోలేదని అడగగా వాళ్లు తమకు చూపు లేదని ఒక పాఠం చదివి వినిపిస్తారా.? అని అడిగారని వాళ్లు అలా అడగడంతో తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని అన్నారు.

తనకు అన్నీ ఉన్నా సమయం వృథా చేస్తున్నానని.వాళ్లు చదువుకోవడానికి ఆటంకం ఉన్నా తపనతో చదివేందుకు ప్రయత్నిస్తున్నారని అనిపించిందని చెప్పారు.ఆ తర్వాత రోజూ పాఠాలు చదివి వినిపించే వాడినని అలా చేయడం వల్ల వాళ్లు బీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ కాగా తాను మాత్రం బీఎస్సీ ఫెయిల్ అయ్యానని తెలిపారు.వాళ్లు రైల్వే స్టేషన్ లో అనౌన్స్ మెంట్ జాబ్స్ కోసం దరఖాస్తు చేస్తామని కాలేజీ వదిలి వెళ్లే సమయంలో చెప్పారని అన్నారు.

మనలో చాలామంది కళ్లు ఉన్నా తాగుతూ, తూలుతూ నడుస్తామని.బ్లైండ్ పీపుల్ కు మనతో పోలిస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో పాటు దేనిని పట్టుకున్నా ఆ స్పర్శ వాళ్లకు జీవితాంతం గుర్తుంటుందని అన్నారు.

బ్లైండ్ పీపుల్ కు ఉండే అలెర్ట్ నెస్ లో 10 శాతం కూడా మనకు ఉండదని అన్నారు.కళ్లు లేకపోయినా వాళ్లు ఏ విషయాన్నైనా పాజిటివ్ గా ఆలోచిస్తారని తెలిపారు.

#Show #Puri #Puri Jagannadh #Blind #Puri Details

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు