పూరి జగన్నాధ్ రూమ్ మేట్ ఇండస్ట్రీ లో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా.. ?

పూరీ జగన్నాథ్. తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడు.

 Puri Jagannadh Shared Room With Raghu Kunche, Raghu Kunche, Puri Jagannadh, Puri-TeluguStop.com

మాసే కాదు.ఊరమాస్ సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి.

సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే ఆయ‌న త‌ర్వాతే మరెవరైనా అని చెప్పుకొవచ్చు.పూరీకి పరిచయం అయిన ఓ వ్యక్తి.

మంచి అవకాశాలతో ముందుకు సాగాడు.ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.

పూరీతో జతకలిసి ఆ వ్యక్తి మరెవరో కాదు.రఘు కుంచె.

సినిమా అవ‌కాశాల కోసం పూరీ హైద్రాబాద్ లోని స్టూడియోల చుట్టు తిరుగుతున్న‌ప్పుడు ర‌ఘు కుంచె ఆయ‌న‌కు పరిచయం అయ్యాడు. వాయిస్ బాగుంది సినిమాలలో ట్రై చేయండి అని తన ఫ్రెండ్ చెప్పడంతో రఘు హైదరాబాద్ కు వచ్చాడు.

అదే సమయంలో పూరీ కలిశాడు.ఇద్దరు సినిమాల కోసం ప్రయత్నిస్తున్న వేళ.మంచి స్నేహితులుగా మారారు.ఆ తర్వాత ఇద్దరు కలిసి ఓకే రూం తీసుకున్నారు.

అటు రఘు హీరోగా పూరీ కొన్ని సింగిల్ ఎపిసోట్లకు దర్శకత్వం చేశాడు.

Telugu Debut, Puri Jagannadh, Purijagannadh, Raghu Kunche, Raghukunche-Telugu St

పూరీ 2000లో సంవత్సరంలో బ‌ద్రి సినిమాలో అవకాశం వచ్చింది.ఈ సినిమాతో డెబ్యూ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీకి జగన్నాథ్ ప‌రిచ‌య‌మ‌య్యాడు.అదే స‌మ‌యంలో ర‌ఘు యాంక‌ర్ గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా బిజీ అయ్యాడు.

అనంతరం తన మూవీ బాచీలో రఘుకు ఓ పాట పాడే అవకాశం ఇచ్చాడు.రఘు పాడిన ల‌చ్చిమీ ల‌చ్చిమీ అనే పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఆ పాట తర్వాత ఆయనకు మరిన్ని పాటలు పాడే అవకాశం వచ్చింది.ఇక తన త‌మ్ముడి సినిమా అయిన బంఫ‌ర్ ఆఫ‌ర్ మూవీలో ర‌ఘుకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవ‌కాశ‌ ఇచ్చాడు పూరీ.

దాంతో మరో మెట్టు ఎక్కాడు రఘు.ఇప్ప‌టికీ వీరి స్నేహం కొన‌సాగుతూనే ఉంది.అటు పలు విభాగాలంలొ ర‌ఘు కుంచె ఇప్ప‌టి వ‌ర‌కు 5 నంది అవార్డుల‌ను గెల్చుకున్నాడు.తన ఎదుగుదలకు కారణం పూరీయే అంటాడు రఘు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube