టాలీవుడ్ స్టార్ హీరోపై సెటైర్ వేసిన పూరీ జగన్నాథ్!  

Puri jagannaadh satires on star hero Mahesh babu, Puri jagannaadh, Mahesh babu, Puri Jagannadh birthday, Mahesh babu tweets, Netizens - Telugu Birthday Wishes, Janaganamana, Mahesh Babu, Mahesh Babu Tweets, Netizens, Puri Jagannaadh, Puri Jagannaadh Satires On Star Hero Mahesh Babu, Puri Jagannadh, Puri Jagannadh Birthday

టాలీవుడ్ డైరెక్టర్లలో రొటీన్ కథలకు భిన్నంగా నవ్యత ఉన్న కథలతో హీరోలను స్టైలిష్ గా చూపే దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు.పూరీ సినిమాలలో హీరోల పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి.పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో పోకిరి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.2006లో విడుదలైన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.మహేష్ పూరీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

TeluguStop.com - Puri Jagannadh Satires On Star Hero Mahesh Babu

పోకిరి సినిమా తరువాత మహేష్ పూరీ కాంబినేషన్ లో బిజినెస్ మేన్ సినిమా తెరకెక్కగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబు పాత్రలు కూడా అభిమానులను ఎంతగానో అలరించాయి.ఆ తర్వాత మహేష్ బాబును దృష్టిలో ఉంచుకుని పూరీ జగన్నాథ్ జనగణమన కథ రాసుకున్నాడు.

TeluguStop.com - టాలీవుడ్ స్టార్ హీరోపై సెటైర్ వేసిన పూరీ జగన్నాథ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ఈ ప్రాజెక్ట్ వల్ల మహేష్, పూరీ జగన్నాథ్ మధ్య దూరం పెరిగిందని కూడా వార్తలు వచ్చాయి.

కొన్ని నెలల క్రితం పూరీ జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మహేష్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది.? అనే ప్రశ్న ఎదురు కాగా సక్సెస్ లో ఉంటే మాత్రమే మహేష్ ఛాన్స్ ఇస్తాడని లేకపోతే ఇవ్వడని పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.మహేష్ తో తనకు సినిమా చేసే ఉద్దేశం లేదని పూరీ చెప్పారు.

అయితే నిన్న పూరీ జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు “తన ఫేవరెట్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని ట్వీట్ చేయగా పూరీ స్పందిస్తూ “మీరు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.

కొందరు నెటిజన్లు పూరీ ట్వీట్ ను చూసి పూరీ మహేష్ పై సెటైర్ వేశాడని చెబుతుండగా మరి కొందరు మాత్రం అదేం లేదని అంటున్నారు.భవిష్యత్తులో మహేష్ పూరీ కలిసి పని చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

#Puri Jagannaadh #Janaganamana #Birthday Wishes #Netizens #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Jagannadh Satires On Star Hero Mahesh Babu Related Telugu News,Photos/Pics,Images..