లైగర్ ని హైదరాబాద్ లో ముగించే పనిలో పడ్డ పూరీ

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

 Puri Jagannadh Plan To Liger Shoot In Hyderabad-TeluguStop.com

పూరి జగన్నాథ్ కి ఇదే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఇండియన్ వైడ్ గా తన మార్క్ మరోసారి చూపించాలని లైగర్ మూవీ కోసం ఎక్కువగా కష్టపడుతున్నాడు.ఈ నేపధ్యంలో స్టార్ హీరోల సినిమాలకంటే లైగర్ షూటింగ్ కోసం పూరి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

దానికితోడు కరోనా సిచువేషన్ ఈ సినిమాకి మొదటి నుంచి అడ్డంకిగా మారుతూ వస్తుంది.ఈ మూవీ ఫారిన్ షెడ్యూల్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.

 Puri Jagannadh Plan To Liger Shoot In Hyderabad-లైగర్ ని హైదరాబాద్ లో ముగించే పనిలో పడ్డ పూరీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత ఏడాది డిసెంబర్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన ముంబైలో మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసి ఫారిన్ వెళ్లాలని అనుకున్నారు.

ఇంతలో కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వాయిదా పడేలా చేసింది.

ఈ నేపధ్యంలో పూరి జగన్నాథ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఫారిన్ లో షూట్ చేయాలని అనుకున్న సన్నివేశాలు అన్ని కూడా హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా సెట్స్ వేసి ఫినిష్ చేయాలని భావిస్తున్నారు.

ఇప్పట్లో ఫారిన్ వెళ్లి షూటింగ్ చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని ఈ నేపధ్యంలో రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సినిమాకి కావాల్సిన ఫారిన్ ఎలివేషన్ సెట్స్ వేసి షూట్ చేయాలని భావిస్తున్నారు.దీనికోసం ఇప్పటికే ఈ మూవీ కోసం పని చేస్తున్న హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని కూడా హైదరాబాద్ రప్పించే పనిలో ఉన్నారని, త్వరలో వారు హైదరాబాద్ లో అడుగుపెడతారని తెలుస్తుంది.

వారు వచ్చిన తర్వాత సిచువేషన్ చూసుకొని షూట్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.

#Ananya Pandey #Pan India Movie #Puri Jagannadh #LigerMovie #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు