బాలయ్యని పాన్ ఇండియా స్టార్ చేయనున్న పూరి జగన్నాథ్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్నారు.ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

 Puri Jagannadh Plan Pan India Movie With Balakrishna-TeluguStop.com

దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు.ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలని బాలయ్య లైన్ లో పెట్టేశాడు.

ఇదిలా ఉంటే బాలయ్య గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకున్నా బాలయ్య ఎనర్జీ లెవల్స్ ని పూరీ తెరపై అద్బుతంగా ప్రెజెంట్ చేసారని పేరు వచ్చింది.

 Puri Jagannadh Plan Pan India Movie With Balakrishna-బాలయ్యని పాన్ ఇండియా స్టార్ చేయనున్న పూరి జగన్నాథ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపధ్యంలో పూరి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి బాలయ్య అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.పూరి జగన్నాథ్ కూడా బాలయ్య బాబుతో త్వరలో మరో సినిమా కచ్చితంగా చేస్తానని చెప్పాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.దీని తర్వాత కూడా పూరి చేయబోయే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయని అది కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ లోనే ఉంటాయని చార్మి క్లారిటీ ఇచ్చింది.లైగర్ మూవీ తర్వాత పూరి ఒక స్ట్రైట్ హిందీ మూవీ చేయాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

దాని తర్వాత మళ్ళీ తెలుగు హీరోలతో సినిమాలు చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

Telugu Akhanda Movie, Anil Ravipudi, Balakrishna, Bollywood, Gopichand Malineni, Liger, Liger Movie, Paisa Vasool, Puri Balayya Pan India Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda-Movie

ప్రస్తుతం పూరి లైన్ లో బాలయ్యతో పాటు రాం కూడా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కోసం రెడీగా ఉన్నాడు.ఒక వేళ బాలకృష్ణతో పూరి జగన్నాథ్ సినిమా చేస్తే అది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది.ఈ విధంగా బాలకృష్ణ హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది.

#Balakrishna #Liger #Paisa Vasool #Anil Ravipudi #PuriBalayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు