కొడుకుతోనే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్న పూరి

స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

 Puri Jagannadh Plan Akash Thirld Film With Her Director, Tollywood, Telugu Cinem-TeluguStop.com

తన స్టైల్ లో యాక్షన్ కథాంశంతోనే ఈ సినిమాని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా అనన్యా పాండే నటిస్తుంది.

భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్, చార్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేసిన పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయని గతంలో చార్మి స్పష్టం చేసింది.ఈ నేపధ్యంలో నెక్స్ట్ బాలీవుడ్ హీరోతో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడని టాక్ వచ్చింది.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో సినిమాలు చేస్తాడని కూడా కథనాలు వినిపించాయి.

Telugu Akash Puri, Pan India, Puri Jagannadh, Romantic, Telugu, Tollywood-Gossip

అయితే పూరి నెక్స్ట్ స్టార్స్ తో చేయకుండా తన కొడుకుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే కొడుకుని హీరోగా పెట్టి మెహబూబా అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్న పూరికి తన కొడుకు ఆకాష్ ని కమర్షియల్ హీరోగా చూసుకోవాలనే కోరిక ఉందని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో రెండో సినిమాని కూడా తన హోమ్ బ్యానర్ లోనే తన అసోసియేట్ అనిల్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రొమాంటిక్ అనే సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమా ఇప్పటికే పూర్తయిన ఎందుకనో పూరి మాత్రం సినిమాకి ఎలాంటి ప్రచారం కల్పించడం లేదు.అయితే ఆకాష్ తో మూడో సినిమాని తన దర్శకత్వంలోనే పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఫైటర్ పూర్తి కాగానే ఆకాష్ మూవీ ఉంటుందని, దీనిని పాన్ ఇండియా రేంజ్ లోనే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube