నిశ్శబ్ధంగా కానిచ్చేసిన పూరీ..?  

Puri Jagannadh Nishabdham Anushka Shetty - Telugu Anjali, Anushka Shetty, Nishabdham, Puri Jagannadh

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

 Puri Jagannadh Nishabdham Anushka Shetty

కానీ వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు జల్లింది.దీంతో ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడింది.

అయితే ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాను సైలెంట్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

నిశ్శబ్ధంగా కానిచ్చేసిన పూరీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం థియేటర్లు కూడా తెరుచుకునేందుకు సిద్ధమవుతుండటంతో నిశ్శబ్ధం చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రైవేటు స్క్రీనింగ్‌ను వేయగా దీన్ని క్రేజీ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ తిలకించాడట.

ఇటీవల నిశ్శబ్ధం చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమా డైరెక్టర్ హేమంత్ మధుకర్ పూరీకి మంచి మిత్రుడు కావడం, అనుష్కను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీయే కావడం, ఇటీవల నిశ్శబ్ధం ట్రైలర్‌ను కూడా పూరీయే రిలీజ్ చేయడంతో ఈ సినిమా ప్రైవేటు స్క్రీనింగ్‌ను పూరీ కోసం వేశారట చిత్ర యూనిట్.

మొత్తానికి లాక్‌డౌన్ తరువాత రిలీజ్ కాబోతున్న తొలి సినిమాగా నిశ్శబ్దం నిలవనుంది.మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test