కరణ్ జోహార్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ మరో పాన్ ఇండియా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 Puri Jagannadh Next Movie In Karan Johar Production-TeluguStop.com

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండటం విశేషం.ఇక ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా అయినా కేవలం మూడు నెలల్లో పూర్తి చేసే పూరి జగన్నాథ్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులు టైమ్ తీసుకుంటున్నాడు.

దానికితోడు కరోనా లైగర్ మూవీ షూటింగ్ కి పెద్ద అడ్డంకిగా మారుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత కూడా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీస్ చేస్తారని గతంలోనే చార్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Puri Jagannadh Next Movie In Karan Johar Production-కరణ్ జోహార్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ మరో పాన్ ఇండియా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Charmi Kaur, Karan Johar Production, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda-Movie

ఇదిలా ఉంటే పూరి నెక్స్ట్ సినిమాని కరణ్ జోహార్ నేరుగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తుంది.అది కూడా సౌత్ స్టార్ తోనే పాన్ ఇండియారేంజ్ మూవీనే పూరితో కరణ్ ప్లాన్ చేస్తున్నారని బిటౌన్ లో వినిపిస్తున్న మాట.తెలుగు నిర్మాతలు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న నేపధ్యంలో కరణ్ జోహార్ కూడా సౌత్ మార్కెట్ మీద దృష్టి పెట్టి పూరి జగన్నాథ్ తోనే మొదటి ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తుంది.ఇక పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా స్టార్స్ తో చేయాలంటే అది లైగర్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది.

అలాగే లైగర్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్, బాలయ్యతో ఒక మూవీ, పవన్ కళ్యాణ్ తో మూవీలని పూరి లైన్ లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

#Charmi Kaur #Puri Jagannadh #KaranJohar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు