తాను చనిపోయే లోపు ఆ ప్రముఖ వ్యక్తిని కలుస్తా అంటున్న పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ తన పాడ్ కాస్ట్ వీడియోల ద్వారా ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నారు.వ్యక్తిగత జీవితం గురించి సామాజిక విషయాలు, స్ఫూర్తినిచ్చే అంశాలని కూడా షేర్ చేసుకుంటున్నారు.

 Puri Jagannadh Like To Meet David Attenborough, Tollywood, Bbc, Discovery Channe-TeluguStop.com

వీటికి సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది.ఈ పాడ్ కాస్ట్ వీడియోలలో కొన్ని వివాదాస్పదంగా కూడా మారిపోయాయి.

ఇదిలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ తన జీవితంలో చనిపోయేలోపు ఒక వ్యక్తిని చూడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.అయితే ఆయన బయటి ప్రపంచానికి కనిపించే సెలబ్రెటీ కాదు.

కానీ ఇప్పుడు డిస్కవరీ ఛానల్ లో వచ్చే ప్రోగ్రామ్స్ సృష్టికర్త.నేచురల్‌ హిస్టారియన్‌ డేవిడ్‌ అటెన్‌బరో.

అతను తనకి అత్యంత ఇష్టమైన వ్యక్తి అని పేర్కొన్నారు.తాను చనిపోయేలోపు జీవితంలో ఒక్కసారైనా ఆయనను కలవాలనుకుంటున్నానని చెప్పారు.

డేవిడ్‌ అటెన్‌బరో పేరు చాలా మందికి తెలియదని, అయితే గాంధీ సినిమాను తీసిన రిచర్డ్ అటెన్‌బరో పేరు మాత్రం తెలిసే ఉంటుందని చెప్పారు.ఆయన తమ్ముడే ఈ డేవిడ్‌ అటెన్‌బరో అని వివరించారు.

ఆయనొక నేచురల్‌ హిస్టారియన్‌ అని, 1926లో లండన్‌లో పుట్టాడని తెలిపారు.చిన్నప్పటి నుంచి ఫాజిల్స్, పురాతనమైన స్టోన్స్, నేచురల్‌ స్పెసిమెన్స్‌ ని ఆయన సేకరించడం ప్రారంభించారని చెప్పారు.

కేంబ్రిడ్జ్ వర్సిటీలో జియోలజీ, జువాలజీ చదివారని వివరించారు.ఆయనకు ప్రకృతి‌ అంటే చాలా ఇష్టమని, ఆయనకు బీబీసీలో ఉద్యోగం‌ వచ్చిందని అన్నారు.

అందులో యానిమల్‌ ప్యాట్రన్స్ అని ఒక సిరీస్‌ చేశారని తెలిపారు.అనంతరం యాంత్రోపాలజీలో పీజీ పూర్తి చేశారని, జంతువులను ఇంకా పూర్తిగా స్టడీ చేయడం ప్రారంభించారని చెప్పారు.

బీబీసీ కోసం ఆయన వైల్డ్ లైఫ్‌ మీద ఎన్నో డాక్యుమెంటరీలు‌ తీశారని వివరించారు.బీబీసీ, డిస్కవరీ, నేషనల్‌ జియోగ్రఫీ ఇలా అన్నిటికీ ఆయన డాక్యుమెంటరీలు నిర్మించారని చెప్పారు.

ఆయన కృషి లేకపోతే మనకి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసేవి కావని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube