చిక్కుల్లో పడ్డ పూరి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తాజాగా పవన్‌ కళ్యాణ్‌కు తన అభిమానులను అదుపులో ఉంచుకోవాలి అంటూ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.పూరి వార్నింగ్‌తో పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు.

 Puri Jagannadh Fires On Pawan Kalyan Fans-TeluguStop.com

తమ అభిమాన హీరోకు సహాలు ఇచ్చేంత వాడా పూరి అంటూ అభిమానులు ఆగ్రహంతో ఊగి పోతున్నారు.త్వరలో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్‌’ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.

ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌ తమ ఆగ్రహంను చూపించాలని భావిస్తున్నారు.

‘లోఫర్‌’ విడుదల సమయంలో పూరి చేసిన వ్యాఖ్యలు నిర్మాతకు ఇబ్బందులు తెచ్చేలా ఉన్నాయి.

పవన్‌ ఫ్యాన్స్‌ ‘లోఫర్‌’ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే ‘లోఫర్‌’లో నటించిన వరుణ్‌ తేజ్‌ మెగా హీరో అవ్వడంతో ఈ సినిమాకు చిక్కులు తేకున్నా ఆ తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చే సినిమాలకు అయినా పవన్‌ ఫ్యాన్స్‌ అడ్డంకులు సృష్టించే అవకాశాలు లేక పోలేదు అంటూ విశ్లేషకులు అంటున్నారు.

దాంతో ఇప్పుడు పూరి ఎందుకు అనవసరంగా మాట్లాడానా అంటూ ఆందోళన చెందుతున్నట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube