మరో పాన్ ఇండియా మూవీపై కన్నేసిన పూరీ  

Puri Jagannadh Fighter Movie Vijay Devarakonda - Telugu Ananya Pandey, Fighter Movie, Puri Jagannadh, Vijay Devarakonda

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఎంతోకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూరీ తిరిగి ఫాంలోకి వచ్చాడు.

 Puri Jagannadh Fighter Movie Vijay Devarakonda

ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి చేస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ.

విజయ్ దేవరకొండను చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు చూపించనున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్.ఇక ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

మరో పాన్ ఇండియా మూవీపై కన్నేసిన పూరీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇండియా లెవెల్‌లో పూరీ తన మార్క్‌ను చూపించాలని చూస్తున్నాడు.ఇదిలా ఉండగా, తన నెక్ట్స్ మూవీ కోసం స్క్రిప్టు పనులు కూడా మొదలుపెట్టాడట ఈ డైరెక్టర్.

స్టార్ హీరోను దృష్టిలో పెట్టుకుని పూరీ ఈ కథ రాస్తున్నట్లు తెలుస్తోంది.

మరో విశేషమేమిటంటే, ఈ సినిమాను కూడా పూరీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

అయితే ఇది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసమేనని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.గతంలోనే వీరి కాంబోలో మూడో సినిమా రావాల్సి ఉందని, కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదని పలువురు అంటున్నారు.

ఇప్పుడు మరోసారి ఈ కాంబోను తెరకెక్కించేందుకే పూరీ పాన్ ఇండియా మూవీని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Jagannadh To Make Pan India Movie After Fighter Related Telugu News,Photos/Pics,Images..