నిర్మాతగా మారబోతున్న పూరీ కూతురు.. త్వరలోనే ఎంట్రీ!

పూరీ జగన్నాథ్.ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతియసోక్తి కాదేమో.

 Puri Jagannadh Daughter Pavithra Producer, Puri Jagannadh, Puri Jagannadh Daught-TeluguStop.com

ఈయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అగ్ర దర్శకుడిగా టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాడు.మేకర్ గా తన కెరీర్ లో పూరీ చాలా సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.

ఇక ప్రెసెంట్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసాడు.ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.

లైగర్ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేసారు.ఈ సినిమా తర్వాత వెంటనే పూరీ గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా జనగణమన కూడా ప్రకటించాడు.

లైగర్ రిలీజ్ కాకుండానే మరొక పాన్ ఇండియా సినిమా సార్ట్ చేసి పూరీ అందరికి షాక్ ఇచ్చాడు.ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండనే హీరోగా నటిస్తున్నారు.

ప్రెసెంట్ పూరీ జనగణమన షూటింగ్ స్టార్ట్ చేసి వేగంగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈయన సంగతి పక్కన పెడితే పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ కూడా నిర్మాతగా సినీ రంగంలోకి ప్రవేశించబోతుంది అని వార్తలు వస్తున్నాయి.ఈయన స్టార్ డైరెక్టర్ గా ఉంటే.

ఈయన కుమారుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇక ఇప్పుడు ఈయన కూతురు కూడా నిర్మాతగా మారి చక్రం తిప్పడానికి సిద్ధం అవుతుంది.

Telugu Charmi Kaur, Jana Gana Mana, Liger, Pavithra Puri, Puri Jagannadh, Purija

పూరీ నిర్మాతగా కూడా మారి వైష్ణో అకాడమీ అనే పేరుతొ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేసాడు.ఆ తర్వాత ఇదే సంస్థను పూరీ కనెక్ట్స్ గా మార్చి ఛార్మీ ను కూడా భాగస్వామ్యం చేసుకుని ఆమెకు నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు.ఇక ఇదే సంస్థలో పవిత్ర పూరీ భాగస్వామ్యం అవుతున్నట్టు టాక్.పవిత్ర ఇటీవలే ఎంబీఏ పూర్తి చేసిందట.ఇక మరికొద్ది రోజుల్లోనే పూరీ కనెక్ట్స్ బాధ్యతలు ఈమె చేతుల్లోకి వెళ్లనున్నాయని సమాచారం అందుతుంది.మరి అతికొద్ది మంది ఉన్న లేడీ నిర్మాతల్లో ఈమె కూడా స్థానం సంపాదించుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube