కన్ఫ్యూజన్‌లో పూరి.. విజయ్ కోసమేనా?  

Puri Jagannadh Confusion Over Liger Title - Telugu Ananya Pandey, Charmee, Liger, Puri Jagannadh, Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు.ఈ సినిమాను పెద్దగా పట్టించుకోని రౌడీ, తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో యమ బిజీగా మారిపోయాడు.

 Puri Jagannadh Confusion Over Liger Title

క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

ఇక ఈ సినిమాకు తొలుత టైగర్ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వినిపించినా, ఆ తరువాత దాన్ని ‘లైగర్’గా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

కన్ఫ్యూజన్‌లో పూరి.. విజయ్ కోసమేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ టైటిల్ విషయంలో ఇప్పుడు పూరి కన్ఫ్యూజన్‌లో పడ్డాడు.ఒకవిధంగా లైగర్ అనే టైటిల్‌ను Lion నుండి Li, Tiger నుండి ger తీసుకొని (Liger) లైగర్‌గా పెట్టాడు పూరి.

కానీ ఆ పదానికి పిల్లి అనే అర్ధం వస్తుండటం, విజయ్ లాంటి హీరోకు ఇలాంటి టైటిల్ ఏమిటి అనే అనుమానాలు రావడంతో ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు పూరి.

మరి ఈ సినిమా కోసం పూరి మరేదైనా పవర్‌ఫుల్ టైటిల్‌ను వాడుతాడా లేక ఇదే కొత్తగా ఉందని కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా పూరి, చార్మి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Jagannadh Confusion Over Liger Title Related Telugu News,Photos/Pics,Images..

footer-test