ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తూనే కొత్త ప్రాజెక్ట్స్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన మూడు కొత్త సినిమాలను ప్రకటించాడు.
ఒకటి తర్వాత మరొకటి స్టార్ట్ చెయ్యబోతున్నాడు చిరంజీవి.ప్రెసెంట్ చేస్తున్న ఆచార్య సినిమా దాదాపు పూర్తి అయ్యిందనే అనుకుంటున్నారు.
అందుకే చిరంజీవి నెక్స్ట్ సినిమా గాడ్ ఫాదర్ ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాడు.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇటీవల బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు కొబ్బరి కాయ కొట్టి స్టార్ట్ చేసారు.
ఈ వేడుకలో పూరీ జగన్నాథ్ కూడా పాల్గొన్నాడు.
దీంతో చిరు – పూరీ కాంబో మరొకసారి తెరపైకి వచ్చింది.ఎప్పటి నుండో వీరిద్దరి కాంబోలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నాలుగుసార్లు అవకాశం రాగా ఒక్క సారి మాత్రం టైటిల్ ప్రకటించే వరకు వచ్చింది.

కానీ మళ్ళీ ఈ సినిమాకు బ్రేకులు పడక తప్పలేదు.ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో సినిమా మాత్రం రాలేదు.
ఇన్నిసార్లు వీరిద్దరి సినిమా ఆగిపోయిన కూడా పూరీ మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు.
పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.ఏదో ఒకరోజు ఖచ్చితంగా మెగాస్టార్ ను ఒప్పిస్తానని ధీమాగా చెప్తూ ఉండేవాడు.
ఇక ఇప్పుడు చిరు సినిమా లాంచ్ లో పూరీ పాల్గొనడంతో మరొకసారి వీరిద్దరి సినిమా తెరపైకి వచ్చింది.ఈ వేడుకలో పూరీ జగన్నాథ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడనే చెప్పాలి.

ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఆటో జానీ సినిమా అంశం హాట్ టాపిక్ అయ్యింది.అప్పుడు కథ విషయంలో చిరు కొంత అనుమానం వ్యక్తం చేయడంతో ఇప్పుడు పూరీ మళ్ళీ కథలో మార్పులు చేసి మళ్ళీ చిరు తో సినిమాకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అదే కనుక నిజమైతే ఈ కాంబో లో తెరకెక్కే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.