సైబర్ పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ డైరెక్టర్ పూరి  

Puri Jagannadh Approach To Cyber Police-

చాలా గ్యాప్ తరువాత పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.ఇస్మార్ట్ శంకర్ పేరు తో వస్తున్న ఈ చిత్రం స్టిల్స్ కూడా అదరగొడుతున్నాయి.అయితే ఇవన్నీ పక్కన పెడితే పూరి ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది...

Puri Jagannadh Approach To Cyber Police--Puri Jagannadh Approach To Cyber Police-

తన కథను దొంగిలించారు అంటూ పూరి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మూవీ స్క్రిప్ట్ బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళి కృష్ణ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి లీక్ చేసారు అంటూ సైబర్ పోలీసులను పూరి ఆశ్రయించారు.అయితే ఆ పోస్ట్ ని ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ వారు తీయలేదని ఈ నేపథ్యంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినట్లు తెలిపారు.

అయితే కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Puri Jagannadh Approach To Cyber Police--Puri Jagannadh Approach To Cyber Police-

రామ్ కధానాయకుడి గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన నభా పటేల్,నిధి అగర్వాల్ లు జోడి గా నటిస్తున్న సంగతి తెలిసిందే.పూరి కనెక్ట్ పతాకం పై ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రచార దృశ్యాలు ఆకట్టుకున్నాయి.దీనితో ఇస్మార్ట్ శంకర్ చిత్రం పై అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు.

అంతేకాకుండా ఈ చిత్రంలో రామ్ పాత్ర కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.ఈ చిత్రం ఈ నెల 12 న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.