పూరీ సినిమా నుంచి రౌడీ స్టార్ లుక్ కి ముహూర్తం ఫిక్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్నారు.ఫైటర్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Puri Jagannadh And Rowdy Star Movie First Look Reveal, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

ఇక చార్మ్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పూరి విజయ్ దేవరకొండని ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని సరికొత్త లుక్ లో ఆవిష్కరించబోతున్నాడని తెలుస్తుంది.

బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మలయాళీ స్టార్ సురేష్ గోపీ, బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇందులో సురేష్ గోపి విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

ఇక తండ్రి కొడుకుల చుట్టూ బాక్సింగ్ నేపధ్యంలో నడిచే మాఫియా కథాంశంతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ లాక్ డౌన్ కి ముందే ముంబైలో పూర్తయ్యింది.ఇంకా కొంత భాగం షూట్ చేయాల్సి ఉన్న పూరి జగన్నాథ్ ఎందుకనో సెట్స్ పైకి వెళ్ళలేదు.ఫిబ్రవరి నుంచి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే తన సినిమా ఇన్నేళ్ల కెరియర్ లో మొదటిసారి బాగా ఆలస్యం అవుతూ ఉండటంతో ఫ్యాన్స్ కి ఏదో ఒక అప్డేట్ ఉండాలని ఫైటర్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ లో రిలీజ్ చేయడానికి పూరీ రెడీ అయ్యాడు.దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు.

నిర్మాత చార్మ్ అఫీషియల్ గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ అభిమానులతో పంచుకున్నారు.

బాక్సింగ్‌ రింగ్‌లో పాయింట్లు చూపించినట్లుగా ఆ పోస్టర్‌ ఉంది.అందులో చేతిక ధరించే గ్లౌవ్స్ ఉన్నాయి.ఈ రోజు 10.08నిమిషాలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రాబోతోందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube