పూరి 'డబుల్‌ ఇస్మార్ట్‌'.... ఇది మరీ ఓవర్‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తీసిన సినిమాలు మూడు నాలుగు సంవత్సరాలుగా సరిగా ఆడటం లేదు.ఆయన ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాయి.‘టెంపర్‌’ కాస్త పర్వాలేదు అనిపించినా అంతకు ముందు ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాయి.తాజాగా ఈయన తన కొడుకు పూరి ఆకాష్‌తో కలిసి ‘మెహబూబా’ చిత్రంను చేశాడు.

 Puri Jagannadh And Ram Movie Title Is Double Ismart-TeluguStop.com

ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అయ్యింది.మళ్లీ ఇప్పుడు రామ్‌ తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చేస్తున్నాడు.

ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో జనాలు ముందే ఊహిస్తున్నారు.

 Puri Jagannadh And Ram Movie Title Is Double Ismart-పూరి డబుల్‌ ఇస్మార్ట్‌’…. ఇది మరీ ఓవర్‌-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎక్కువ శాతం జనాలకు ఈ చిత్రంపై అసలు అంచనాలే లేవు.అయినా కూడా పూరి ఈ చిత్రంను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు.రామ్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నభా నటేష్‌ మరియు నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే.ఈ సమయంలోనే పూరి బ్యానర్‌ నుండి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు.

ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ అనే చిత్రాన్ని పూరి తీయబోతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం తీస్తున్న సినిమా పూర్తి కాలేదు, సక్సెస్‌ అవుతుందనే నమ్మకమే లేదు, అయినా అప్పుడే సీక్వెల్‌కు టైటిల్‌ను ప్రకటించడం అంతా ఆశ్చర్యంను కలిగిస్తోంది.డబుల్‌ ఇస్మార్ట్‌ అంటూ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించడంతో పూరి ఇది మరీ ఓవర్‌ అంటూ టాక్‌ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ టైటిల్‌ విషయంలో పూరి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు