టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ సినిమాలో దమ్ము లేకపోవడం, విజయ్ దేవరకొండ రొటీన్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండను చూసి ఓ డైరెక్టర్ కూడా భయపడుతున్నాడు.
తాజాగా క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ.
ఇక ఈ సినిమాలో విజయ్ ఓ బాక్సర్‌గా కనిపిస్తాడు.అయితే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
కానీ విజయ్ చేస్తున్న సినిమాలు ఇటీవల వరుసగా ఫ్లాపులుగా నిలుస్తుండటంతో పూరీ కూడా భయపడుతున్నాడట.
చాలాకాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న పూరీ, విజయ్ పుణ్యమా అని మళ్లీ ఫెయిల్యూర్‌ను చూస్తాడా అనే సందేహం ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.
మరి విజయ్ సక్సె్స్ కోసం పూరీని వినియోగించుకుంటాడా లేక మరో ఫెయిల్యూర్‌ను అంటగడతాడా అనేది ఆసక్తికరంగా మారింది.