పక్కా ఫ్లాప్‌.. మరెందుకు ఈ హడావుడి?       2018-05-16   01:45:03  IST  Raghu V

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మెహబూబా’ చిత్రాన్ని ప్రేక్షకులు తిరష్కరించారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. తన కొడుకు పూరి ఆకాష్‌ను స్టార్‌ హీరోగా పరిచయం చేసేందుకు పూరి కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు. కాని ఫలితం తారు మారు అయ్యింది. మెహబూబా చిత్రం ఫ్లాప్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సగానికి పైగా థియేటర్ల నుండి ఈ సినిమాను తొలగించడం జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం మొదటి వారం రోజుల్లో కనీసం 5 కోట్లు వసూళ్లు చేసే పరిస్థితి లేదు. రెండవ వారం తర్వాత ఈ సినిమా కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అవ్వడం ఖాయం.

ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్‌ సభ్యులు సైలెంట్‌గా ఉండాల్సింది పోయి హడావుడి చేస్తూ పరువు తీసుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున జరిగిన థ్యాంక్స్‌ మీట్‌లో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుందని, సినీ ప్రముఖులు మరియు విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదే వేడుకలో మాట్లాడిన పూరి జగన్నాధ్‌.. తాను తెరకెక్కించిన మెహబూబా చిత్రాన్ని ఆధరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ఈ చిత్రం ప్రత్యేక షోను చూసిన బాలకృష్ణ గారు మంచి సినిమాను చేశారు అంటూ అభినందించారు. అలాగే ఆకాష్‌కు మంచి భవిష్యత్తు ఉందని దీవించారు అంటూ చెప్పుకొచ్చారు. ఇలా అంతా కూడా సినిమాని ఆకాశానికి ఎత్తేలా మాట్లాడారు. అయితే సినిమా పరిస్థితి ఇప్పటికే అందరికి తెలిసి పోయింది. ప్రస్తుత కాలంలో సినిమాను ప్రమోషన్స్‌ చేసి, ఆ సినిమా గురించి ఎక్కువ చేసి చెప్పడం వల్ల ప్రయోజనం లేదనే విషయం పూరి అండ్‌ కో గుర్తించడంలో విఫలం అవుతుంది.

ప్రస్తుత కాలంలో సినిమా విడుదలైన మొదటి రోజే సోషల్‌ మీడియాలో టాక్‌ వైరల్‌ అవుతుంది. సినిమా బాగుంటే బాగుందని, లేదంటే బాగాలేదంటూ అందరికి తెలిసి పోతుంది. సోషల్‌ మీడియా ద్వారా 50 శాతం టాక్‌ స్ప్రెడ్‌ అయితే, మిగిలిన జనాలకు మౌత్‌ టాక్‌ ద్వారా రెండు మూడు రోజుల్లో తెలిసి పోతుంది. అందుకే సినిమా ప్రమోషన్స్‌కు ఇంకా డబ్బులు వృదా చేసుకోవడం మంచి పద్దతి కాదు అంటూ సినీ విశ్లేషకులు పూరికి సలహా ఇస్తున్నారు. కాని ఒక సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పుడు ఫ్లాప్‌ అని తెలిసినా వదిలేయాలనిపించదు. ప్రమోషన్‌ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఆశతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు.