రవితేజను పూరి ఎందుకు పట్టించుకోవడం లేదు?

రవితేజకు మాస్‌ ఇమేజ్‌ను కట్టబెట్టింది పూరి జగన్నాధ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే వరుసగా ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలతో పాటు ఇంకా కొన్ని సినిమాలను రవితేజతో తెరకెక్కించిన పూరి ప్రస్తుతం మాత్రం ఆయన్ను పట్టించుకోవడం లేదు.

 Puri Jaganath Why Not Doing Film With Ravi Teja-TeluguStop.com

విషయం ఏంటో తెలియదు కాని ప్రస్తుతం రవితేజ, పూరిలు కాస్త దూరం దూరంగా ఉంటున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.గతంలో రవితేజ కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పూరి ఆదుకున్నాడు.

Telugu Ammananna, Idiot, Puri Jaganath, Purijaganath, Purijaganthravi-Movie

ప్రస్తుతం రవితేజ వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌లను చవిచూస్తున్నాడు.దాంతో ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు మరియు దర్శకులు భయపడుతున్నారు.ఈ సమయంలో పూరి ఒక సినిమాను రవితేజతో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.వీరిద్దరి కాంబోలో ఇడియట్‌ లేదా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమా రావాలని కోరుకుంటున్నాను అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో లైగర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ తర్వాత సినిమా ఎవరితో అనేది కమిట్‌ అవ్వలేదు.

కొడుకుతో సినిమా ఉండవచ్చు అంటున్నారు.లైగర్‌ ఫలితాన్ని బట్టి పూరి తదుపరి చిత్రం ఉంటుందని అంటున్నారు.

పూరి తర్వాత సినిమా ఎవరితో అయినా వచ్చే ఏడాది వరకైనా రవితేజతో ఒక సినిమాను చేయాలని కోరుకుంటున్నారు.మరి పూరి ఈ విషయమై ఆలోచిస్తాడా చూడాలి.

ఇద్దరి మద్య వ్యవహారం బాగానే ఉంటే వచ్చే ఏడాది వీరి కాంబోలో సినిమా రావాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube