పెళ్లి చేసుకుంటే ఏం పీకలేరు అంటున్న క్రేజీ డైరెక్టర్ పూరి..!

టాలీవుడ్ చిత్ర సీమలో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ లో ముందుగా చెప్పుకునే పేరు పూరి జగన్నాథ్.ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ సినిమాలు తీయడం కంటే యూట్యూబ్ పై పడ్డాడు అని చెప్పవచ్చు.

 Crazy Director Puri Says What Can Not Be Done If You Get Married Puri Jaganath,-TeluguStop.com

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా సినిమా షూటింగ్స్ జరగకపోవడం కారణంతో.ఇప్పుడు ఆయన జీవిత సత్యాలు అంటూ ఓ కార్యక్రమం మొదలు పెట్టాడు.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఉన్నది ఉన్నట్టు గా మాట్లాడిన ఆయన, తాజాగా పెళ్లి ప్రస్తావన పై పడ్డాడు.

ఇక పెళ్లి ప్రస్తావన విషయానికి సంబంధించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.

బుద్ధి ఉన్నవాడు ఎవడు పెళ్లి చేసుకోవద్దు ఆయన మాట్లాడాడు.ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది.

నిజానికి ‘ పూరి మ్యూజింగ్స్ ‘ అనే పేరుతో పూరి జగన్నాథ్ తన వాయిస్ ఓవర్ ఉన్న కొన్ని ఆడియో లను వరుసబెట్టి విడుదల చేస్తున్నాడు.ఇందులో ఇప్పటికే కొన్ని ఆడియో లు కూడా విడుదలయ్యాయి.

ఇక తాజాగా విడుదలైన ఈ వాయిస్ ఓవర్ లో పెళ్లికి పోయేకాలం దగ్గరికి వచ్చింది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఒకవేళ అందరూ అనుకున్నట్టుగానే పెళ్లి నిజంగా అంతా మంచిది అయితే ఏసు క్రీస్తు ప్రభువు 10 పెళ్లిళ్లు చేసుకునే వాడిని, అలాగే ఉన్న భార్యను వదిలేసి రాజుల వంశానికి చెందిన ఓ వ్యక్తి బుద్ధుడు అయ్యాడు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

జీవితంలో ఎవరైనా ఏదైనా సాదించాలి అంటే దయచేసి పెళ్లి చేసుకోవద్దని చేసుకుంటే ఖచ్చితంగా ఏమి పీకలేరు అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు.అలా కాదు జీవితంలో ఏంచేయాలని లేదు నేను అందరిలాంటి వ్యక్తిని, పెళ్లి చేసుకుని పెళ్ళాం చేసిపెట్టే వంటలు తినుకుంటూ… పుట్టిన పిల్లలతో ఆడుకుంటా అనుకుంటే మాత్రమే పెళ్లిళ్లు చేసుకోండి.

అలా కాదు ప్రపంచమంతా తిరగాలి.నాకు ఓ లక్ష్యం ఉంది అంటూ ఉండే వారు జీవితంలో ఇది సాధించాలనుకునే వారు మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకోవద్దని కుండబద్దలు కొట్టాడు పూరి జగన్నాథ్.

అలా కాదు నాకు పెళ్లి లేకపోతే నేను ఉండలేను అనుకునే వారు మాత్రం అర్జెంటుగా నాకు వారి వెడ్డింగ్ కార్డ్ నాకు పంపించండి నేను వచ్చి బ్లెస్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాదు పెళ్లి అయిన వాళ్ళు అంతా పెళ్లి కానీ బాబాల కాళ్లమీద పడతారని తెలియజేశాడు.

సినిమా ఇండస్ట్రీలో కూడా పెళ్లి అయినా హీరోయిన్ కంటే, పెళ్లి కానీ హీరోయిన్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందని తేల్చిచెప్పాడు.పెళ్లి చేసుకున్న హీరోయిన్లను చిత్ర పరిశ్రమ లిస్టు లోంచి తీసి పక్కన పడేసాను అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పెళ్లి చేసుకోవద్దు ఒకవేళ పెళ్లి చేసుకుంటే మళ్లీ చెబుతున్న ఏం పీకలేరు అని తెలియజేశాడు క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube