చార్మితో జత కుదిరింది  

  • డాషింగ్‌ డైరెక్టర్‌ ఒక పక్క స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు చిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. త్వరలో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల కాగానే అంటే ఫిబ్రవరి 20వ తేదీన ఈయన తన మరో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టాడు. చార్మి హీరోయిన్‌గా ‘జ్యోతిలక్ష్మి’ అనే చిత్రాన్ని ఈయన తెరకెక్కించబోతున్నాడు. ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం కావడం విశేషం.

  • మొదట ‘జ్యోతి లక్ష్మి’ చిత్రాన్ని పూరి తన శిష్యుడితో చేయించాలని భావించాడు. అయితే కొన్ని కారణాల వల్ల, ప్రస్తుతం పూరికి మరో సినిమా లేక పోవడంతో ఆ సినిమాను తానే స్వయంగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేశాడు. రెండు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని పూరి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న చార్మికి ప్రస్తుతం ఆశలన్నీ కూడా ‘జ్యోతి లక్ష్మి’పైనే ఉన్నాయి. మరి చార్మితో పూరి కట్టిన జత కుదిరి సక్సెస్‌ సినిమా అవుతుందేమో చూడాలి.