'రొమాంటిక్‌' ను చాలా లేపేశారు.. ఆ స్థాయిలో ఉండేనా మరి!

Puri Akash Movie Romantic Promotions And Prabhas Interview

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ తనయుడు పూరి ఆకాష్ మెహబూబా సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు.చిన్నప్పటి నుండి సినిమాలంటే పిచ్చితో పెరిగిన ఆకాష్‌ పూరి హీరోగా సక్సెస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో చేసిన మెహబూబా సినిమా నిరాశ పర్చింది.

 Puri Akash Movie Romantic Promotions And Prabhas Interview-TeluguStop.com

కొడుకుకు పూరి సక్సెస్ ఇవ్వలేక పోయాడు.ఇప్పుడు పూరి సన్నిహితుడు శిష్యడి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా రెండవ సినిమా రొమాంటిక్ తెరకెక్కిన విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన రొమాంటిక్ సినిమాను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేశారు.ఈ సినిమా ఎలా ఉందో కాని అంచనాలను మాత్రం ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేశారు.

 Puri Akash Movie Romantic Promotions And Prabhas Interview-రొమాంటిక్‌’ ను చాలా లేపేశారు.. ఆ స్థాయిలో ఉండేనా మరి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్‌ చేయడంతో పాటు హీరో మరియు హీరోయిన్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు.ప్రభాస్‌ చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Telugu Film News, Movie News, Puri Akash, Romantic Movie News-Movie

ఇంకా పూరి ఆకాష్ సినిమా రొమాంటిక్ కు రెండు ట్రైలర్ లను విడుదల చేశారు.ఇక ఈసినిమాలో పాత్రను చూస్తుంటే చాలా మాసీగా అనిపిస్తుంది.

ఇడియట్ లో రవితేజ. టెంపర్ లో ఎన్టీఆర్‌.

పోకిరి లో మహేష్‌ బాబును కలగలిపి చూసినట్లుగా ఉంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.ఇంతగా భారీ అంచనాలున్న ఈ సినిమా ను జనాలు ఎలా స్వీకరిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే రొమాంటిక్ సినిమా పై ఉన్న అంచనాలను అందుకోవాలంటే సినిమా లో రొమాన్స్ పీక్స్ లో ఉండాలి.యాక్షన్‌ హై లెవల్‌ లో ఉండాలి.

డ్రామా ఓ రేంజ్‌ లో ఉండాలి.అప్పుడే ఈ సినిమా అంచనాలను అందుకుంటుంది.

మరి ఆ స్థాయి లో ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ తో పాటు కీలక పాత్రలో నటించిన రమ్య కృష్ణ సినిమా పై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు.

మరి కొన్ని గంటల్లోనే ఈ సినిమా భవితవ్యం తేలిపోనుంది.

#Puri Akash #Romantic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube