Cow Vedio : ప్యూర్ లవ్.. ఓనర్ ఒడిలో ఈ ఆవు ఎంత ముద్దుగా పడుకుందో చూడండి!

సోషల్ మీడియాలో ఎన్నో యానిమల్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి.వీటిని చూస్తూ జంతు ప్రేమికులు ఫిదా అవుతుంటారు.

ఇక జంతువులు వాటి యజమానుల మధ్య ప్రేమకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి.ఈ వీడియోలో యజమానులు తమ ఇంట్లో పెంచుకునే జంతువులను చిన్న పిల్లలను లాలించినట్లు లాలిస్తూ, ముద్దు చేస్తూ ఉంటారు.

మనుషుల కంటే ఎక్కువగా జంతువులపై ప్రేమను చూపిస్తూ ఉంటారు.వారు ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ విశ్వాసాన్ని చూపిస్తాయి జంతువులు.

ఈ మూగ జీవులు బయటకి వెళ్లి రాగానే ఎదురుగా వచ్చి పలకరిస్తుంటాయి.మనం ఎంత అలసిపోయి ఉన్నా కొద్ది సేపు వాటితో ఆడుకుంటే ఆ అలసట మొత్తం తిరిపోతుంది.

Advertisement

మనుషులకి, జంతువులకి ఉన్న సంబంధం అలాంటిది మరి.కాగా తాజాగా ఒక వ్యక్తి తన ఆవుని లాలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో ఆవు తన యజమాని ఒడిలో ప్రశాంతంగా తల పెట్టుకొని పడుకుంటుంది.

ఈ వీడియోను అందరి చాలామంది చూసి వావ్ హార్ట్ టచింగ్ అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోని @Buitengebieden అనే ప్రముఖ ట్విట్టర్ పేజ్ ప్యూర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో ట్విట్టర్‌లో షేర్ చేసింది.డిసెంబర్ 1న షేర్ చేసిన ఈ వీడియోకి 22 లక్షల కంటే అధికంగా వ్యూస్ వచ్చాయి.ఈ క్యూట్ వీడియోని మీరు కూడా వీక్షించండి.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు