కాఫీ ధర మనకి తెలిసింది రూ.5 , 10 , మహా అయితే 100 లేదంటే ఓ భారీ షాపింగ్ మాల్ కి వెళ్లి తాగితే 500 ఉంటుంది.కానీ కాలిఫోర్నియా లో ఓ కేఫ్ లో కాఫీ ధర వింటే మాత్రం షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే.ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన కాఫీ గింజలతో ఈ కాఫీ ని తయారు చేస్తారట.సరే అసలు ఈ కేఫ్ లో కాఫీ రేటు ఏంతంటే అక్షరాలా 75 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లో రూ.5,256.ఏంటి షాక్ అయ్యారా మీరు విన్నది నిజమే ఇక్కడ ఒక కాఫీ తాగాలంటే ఆ మొత్తం చెల్లించాల్సిందే.
కాలిఫోర్నియా లోని క్లాచ్ కాఫీ అనే కాఫీ షాపుల్లో “ఎలిడ నేచురల్ గీషా 803” పేరుతో ఈ అత్యంత ఖరీదైన కాఫీ దొరుకుతుంది.
ఇక క్లాచ్ కాఫీకి దక్షిణ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కొ ఈ రెండు చోట్లా ఉండే బ్రాంచేస్లో మాత్రమే ఈ కాఫీ అందుబాటులో ఉంటుంది.ఈ కాఫీ గురించి శాన్ ఫ్రాన్సిస్కొ క్లాచ్ కాఫీ బ్రాంచ్ యజమాని మాట్లాడుతూ 803 అనేది ఇటీవల జరిగిన బెస్ట్ ఆఫ్ పనామా కాఫీ కాంపిటిషన్లో ఈ కాఫీ ఒక పౌండ్ గింజలు ఏకంగా 803 డాలర్లు పలికిందని అందుకే ఈ పేరు పెట్టినట్టుగా తెలిపారు.
అక్కడ జరిగిన ఈ వేలంలో ఈ రకానికి చెందిన కాఫీ గింజలు మొత్తం 45కిలోలు మాత్రమే అమ్మకానికి వఛాయనీ వాటిలో అధికభాగం జపాన్, చైనా ,తైవాన్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు.క్లాచ్ కాఫీకి కేవలం 4 .5 కిలోలు మాత్రమే దక్కాయని తెలిపారు.అత్యధిక నాణ్యత ఉండడంతో ఈ కాఫీ గింజలకు డిమాండ్ భారీ స్థాయిలో ఉందని తెలిపారు.
కాలిఫోర్నియా లో ఉండే వాళ్ళు ఓ సారి ఈ కాఫీ పై లుక్కేయండి.