సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ రాశారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పురంధేశ్వరి లేఖలో పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి తన పదవులు అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని లేఖలో తెలిపారు.

అదేవిధంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు.విజయసాయిరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను లేఖలో పేర్కొన్న పురంధేశ్వరి విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు