ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో పురంధేశ్వరి బహు నేర్పరని తెలిపారు.
ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ మరోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.తండ్రి అధికారంలో ఉన్నంత కాలం టీడీపీతోనే ఉన్న పురంధేశ్వరి చంద్రబాబు పార్టీని చేజిక్కించుకోగానే కాంగ్రెస్ లో చేరిన ఆమె కేంద్రమంత్రి పదవిని అనుభవించారని విమర్శించారు.
ఏపీ విభజన సమయంలో కేంద్రమంత్రిగా పురంధేశ్వరి శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన గొప్ప మహిళంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.