చిన్నమ్మ పెద్ద రాజకీయం ! ఇదా అసలు సంగతి ..?  

Purandeswari Son Hitesh To Join Ycp Party-

తండ్రి ఓ పార్టీ … తల్లి ఓ పార్టీ … వాళ్ల కొడుకు ఓ పార్టీ ! ఇదీ ప్రస్తుతం రాజకీయాల్లో నాయకుల పరిస్థితి. ఎవరు ఏ పార్టీలో ఉంటే ఏంటి …? అంతిమంగా కావాల్సింది మాత్రం అధికారం. దానికోసం తలోదారి పెట్టేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులంతా ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరి ఫ్యామిలిలో కనిపించబోతోంది..

చిన్నమ్మ పెద్ద రాజకీయం ! ఇదా అసలు సంగతి ..?-Purandeswari Son Hitesh To Join YCP Party

దీంతో సర్వత్రా ఈ విషయంపై చర్చ నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో దగ్గుపాటి ఫ్యామిలీకి ఉన్న రాజకీయ పట్టు గురించి పెద్దగా చెప్పానక్కర్లేదు. ఎందుకంటే… దగ్గుపాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్యెల్యే గా … మంత్రిగా… కూడా పని చేశారు. ఆమె భార్య పురంధరేశ్వరి కూడా ఇంతే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.

ఏపీ తెలంగాణ విడిపోయిన తరువాత . ఏపీలో కాంగ్రెస్ కనుమరగవడంతో. పురందేశ్వరి బీజేపీ లో చేరిపోయారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అయినా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఇటీవలే ఆమెకు ఏపీ బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మెన్ గా కూడా పదవి ఇచ్చారు. ఇక దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు తన వారుసుడు హితేశ్ చెంచురామ్‌తో కలిసి వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు..

ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే… ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

తాను . తమ కుమారుడు వైసీపీలో చేరినా… పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక పెద్ద కధే ఉన్నట్టు ఇప్పుడు చర్చ నడుస్తోంది. బీజేపీలో చిన్నమ్మగా ముద్రపడ్డ సుష్మా స్వరాజ్‌. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆమె స్థానంలో పురందేశ్వరికి ప్రాధాన్యత కల్పించి. సుష్మా స్వరాజ్‌ లేని లోటును పూడ్చాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

దీనికి తోడు మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో పాటు రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పంపుతామని పురందేశ్వరికి అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం . అందుకే ఆమె బీజేపీని వీడేందుకు ఇష్టపడడంలేదని తెలుస్తోంది. అయితే వైసీపీ మాత్రం ఆమెను పార్టీలోకి తీసుకొచ్చి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చూస్తోంది.

అదీకాకుండా … ఓకే ఫ్యామిలీకి చెందిన వారు వేరు వేరు పార్టీల్లో ఉంటే… రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది. అయినా ఈ ఏపీ చిన్నమ్మ మాత్రం ససేమీరా అంటున్నట్టు తెలుస్తోంది. ఆమెకు బీజేపీ నుంచి ఈ రేంజ్ లో ఆఫర్ ఉండబట్టే ఇంత బెట్టు చేస్తున్నట్టు కనిపిస్తోంది.