పురంధరేశ్వరి అను నేను వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నానంటే..?       2018-05-15   23:38:38  IST  Bhanu C

రాజకీయం అంటేనే వైకుంఠపాళి వంటిది ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అధికారం , పదవి ఉంటే పర్లేదు కానీ లేకపోతే భవిష్యత్తు అంధకారం అయినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఏపీ బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఎదుర్కుంటోంది. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఒక వెలుగు వెలిగింది . ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించింన తరువాత ఏపీలో కాంగ్రెస్ కు మనుగడ లేకపోవడంతో ఆమె ఆ పార్టీ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. చాలాకాలంగా ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షా పీఠం దక్కుతుందేమో అని ఆశలు పెట్టుకుంది అయితే అది ఆమెకు దక్కలేదు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా ఏపీలో అంతంత మాత్రంగా ఉండడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడింది అందుకే ఆమె బీజేపీకి రాం రాం చెప్పాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

అలాగే ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల విషయాన్ని పక్కనపెట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత నష్టాల పాలు చేశారు. తమ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుతో కలిసి ఇష్టమొచ్చినట్లు దొంగనాటకాలు రాజకీయాలు ఆడారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్ విషయంలో కూడా మోసం చేశారు. ఈ పరిణామాలు అన్ని బిజెపి లో ఉన్న పురందేశ్వరికి నచ్చడంలేదు. ఎలాగూ బీజేపీకి ఏపీలో రాజకీయ మనుగడ ఉందదు అని అర్ధం అవ్వడంతో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళ్లే ఆలోచన లో ఉన్నట్టు సమాచారం. త్వరలో ఓ మంచి ముహూర్తం చూసుకుని వైసీపీ జండా కప్పుకునే ఆలోచనలో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది.

ఆమె జగన్ పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఆమె చెబుతున్న కారణాలు పరిశీలిస్తే.. వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ ఎన్టీఆర్ ని విమర్శించకుండా కేవలం చంద్రబాబు అవినీతేనే ప్రశ్నించడం, ప్రత్యేక హోదా కోసం అలుపు ఎరగకుండా పోరాడటం చెయ్యడం, చంద్రబాబు ఏ విధంగా ఎన్టీ రామారావును మోసం చేశారో… ప్రజలను ఆ విధంగా చంద్రబాబు మోసం చేశారు అంటూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ…ఎన్టీఆర్ పై గౌరవం చూపిస్తు ముందుకి వెళ్లడంతో…పురందేశ్వరి కూడా వైసీపీ పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణ జిల్లాకు ఆయన పేరు పెడతానని చెప్పడం కూడా పురంధేశ్వరిని ఆకట్టుకున్నట్టు ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఆమె కనుక పార్టీలో చేరితే విజయవాడ లోక్ సభ సీటు ఆమెకే అన్నట్టు ప్రచారం కూడా జోరందుకుంది.