లైవ్ రిపోర్టింగ్ లో హల్ చల్ చేసిన కుక్క పిల్ల...వైరల్ వీడియో

లైవ్ రిపోర్టింగ్ అన్నది జర్నలిస్టులకు కత్తి మీద సాము వంటిది.అదే లైవ్ రిపోర్టింగ్ బయట చేయాల్సి వస్తే ఇక చెప్పేదేముంది అక్కడ అకస్మాత్తుగా చాలా జరుగుతుంటాయి.

 Puppy Hull Hull In Live Reporting Viral Video Viral News,viral Videos In Interne-TeluguStop.com

ఆ సంఘటనల వల్ల లైవ్ రిపోర్టింగ్ కాస్త కామెడీగా మారిపోతుంది.ముఖ్యంగా కరోనా సమయంలో ఇటువంటి ఘటనలు చాలా చూసాం.

అయితే లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఓ కుక్క పిల్ల హల్ చల్ చేసింది.దీంతో అక్కడ కొద్ది సేపు నవ్వులు విరిశాయి.

ఇక ఫాక్స్ ఫైవ్ రిపోర్టర్ దానితో కొద్ది సేపు సరదాగా గడిపారు.ఉత్తర వర్జీనియాలో విపరీతమైన మంచు కురుస్తోంది.

అయితే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే విషయంపై అక్కడ రిపోర్టింగ్ చేస్తుండగా అక్కడ ప్రక్కన ఉన్న ఓ ఇంట్లో నుండి కుక్క పిల్ల రిపోర్టింగ్ చేస్తున్న బాబ్ బర్నార్డ్ దగ్గరకు వచ్చింది.అయితే వెంటనే దానిని కొద్ది సేపు ఎత్తుకొని అలాగే లైవ్ రిపోర్టింగ్ కొనసాగించాడు.

వెంటనే ఆ కుక్క పిల్ల యజమాని వచ్చి కుక్క పిల్లను తీసుకెళ్లింది.అయితే ఇంట్లో నుండి బయటకు రావడం గమనించలేదని రిపోర్టర్ తో తెలిపింది.

అక్కడ రిపోర్టర్ తో చర్చిందంతా లైవ్ స్ట్రీమ్ అని చెప్పడంతో ఖంగు తింది.ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూస్తున్న ఫన్నీ కామెంట్లతో మరింత వైరల్ గా మారుతోంది.నెట్టింట్లో ఎంతగానో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube