ఈ పంజాబీ పోలీస్ అమెరికాలో రియ‌ల్ హీరో అయిపోయాడు.. ఎందుకంటే..

జాబుల్లో కెల్లా పోలీస్ జాబు వేరే.ప్ర‌మాదం అంచుల్లోనే నిత్యం పోరాడాల్సి ఉంటుంది.

 Punjabi Police Sumit Sulan Has Become A Real Hero In America Details, Punjabi Po-TeluguStop.com

ఏ క్ష‌ణం ఎలాంటి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఎదురైనా స‌రే త‌మ డ్యూటీలు మాత్రం చేయ‌క త‌ప్ప‌దు.అందుకే వారి ప్రాణాల‌కు కూడా గ్యారెంటీ ఉండ‌దు.

ఇలా నిత్యం స‌వాళ్ల‌తో కూడుకున్న జాబు కాబ‌ట్టే పోలీసుల‌కు అత్యంత గౌర‌వం ఇస్తుంటాం.ఇలా కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో స‌వాళ్ల‌ను అధిగ‌మించి డ్యూటీ చేసిన పోలీసుల‌కు సంబంధించిన వార్తలు నిత్యం నెట్టింట్లో వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

ఇప్పుడు కూడా ఓ పంజాబీ పోలీస్‌కు సంబంధించిన వార్త బాగా పాపుల‌ర్ అవుతోంది.

అయితే ఆయ‌న మ‌న దేశంలో కాకుండా అమెరికాలో రియ‌ల్ హీరోగా మారిపోయాడు.

న్యూయార్క్ లోని ఓ ఇంట్లో పెద్ద గొడవ అవుతోంద‌ని స్థానికంగా ఉండే పోలీసుల‌కు ఇన్ఫ‌ర్మేష‌న్ వెళ్లింది.దీంతో మ‌న భారత సంతతికి చెందినటువంటి సుమిత్ సులెన్ త‌న తోటి సిబ్బందితో క‌లిసి అక్క‌డ‌కు వెళ్లాడు.

కాగా వారు వెళ్లే స‌రికే నిందితుడు లాషాన్ మెకనీల్ కాల్పులు జ‌రుపుతున్నాడు.దీంతో త‌న‌తో పాటు ఉన్న ఇద్ద‌రు సిబ్బందిలో ఒక‌రు చ‌నిపోగా.మ‌రో వ్య‌క్తి గాయపడ్డాడు.అయితే సుమిత్ సులెన్ క్ష‌ణ కాలంలో అలెర్ట్ అయిపోయాడు.

త‌న ద‌గ్గ‌ర ఉన్న తుపాకీతో హంతకుడిపై కాల్పులు జ‌రిపి.ఏ మాత్రం పొర‌పాటు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు.ఎందుకంటే అప్ప‌టికే నిందితుడి ద‌గ్గ‌ర తల్లీకుమారులు బంధీలుగా ఉన్నారు.కాబ‌ట్టి వారిని ర‌క్షించేందుకు అత‌ను అలాంటి ప‌ని చేశాడు.

అయితే నిందితుడు కింద ప‌డిపోతున్న క్ర‌మంలో కూడా మ‌రోసారి కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు.కానీ సుమీత్ చాలా జాగ్ర‌త్త‌గా అత‌న్ని హ‌త‌మార్చి త‌ల్లీ, కొడుకుల‌ను ర‌క్షించాడు.

ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా డ్యూటీని నిర్వహించడంతో అంద‌రూ అత‌న్ని అభినందిస్తున్నారు.

Punjabi Police Sumit Sulan Has Become A Real Hero In America Details, Punjabi Police, Viral News, Punjab Police Officer, Sumit Sulan, Saved The Life, American Cop, New York, Socail Media, Viral - Telugu American Cop, York, Punjab, Punjabi, Saved, Socail, Sumit Sulan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube