మాములుగా సినిమా ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ విషయం బయటకు పొక్కింది అంటే చాలు ఇట్టే వైరల్ అవుతోంది.దీంతో కొందరు నెటిజన్లు కూడా లేనిపోనివి కల్పించి అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ఉంటారు అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణ మురళి సినిమా పరిశ్రమలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ వ్యక్తి చేతిలో మోస పోయిందని దాంతో ఆ పంజాబీ హీరోయిన్ కి న్యాయం చేసేందుకు సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ ని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో కొందరు నెటిజన్లు అసలు టాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఆ హీరోయిన్ ఎవరా.? అంటూ సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు.ఇందులో భాగంగా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాకుండా ఇలాంటి విషయాలను బయట పెట్టడం వల్ల నూతన నటీనటులు అవకాశాల పేరుతో మోసపోకుండా జాగ్రత్త పడతారని కాబట్టి ఇండస్ట్రీకి మంచి జరిగేటువంటి పనులు వెంటనే చేయాలని అలాగే పంజాబీ హీరోయిన్ పేరు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ విషయంపై కొందరు పవన్ కళ్యాణ్ నెగటివ్ అభిమానులు మాత్రం పలు అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఆ పంజాబీ హీరోయిన్ ఏకంగా పాలిటిక్స్ కూడా చదువుతోందని అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణలపై దృష్టి సారించి అప్పుడప్పుడు విమర్శలు చేస్తోందని చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఆ పంజాబీ హీరోయిన్ ఇప్పటికీ మరో పెళ్లి చేసుకోలేదని కూడా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో గత రెండు రోజులుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ చేతిలో మోసపోయిన పంజాబీ హీరోయిన్ ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది.అంతేకాకుండా అసలు పంజాబ్ హీరోయిన్ కి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి సంబంధం ఏమిటో అని మరి కొందరు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దీంతో మరికొంతమంది అభిమానులు మాత్రం ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జనాదరణ బాగా పెరుగుతుందని అందువల్లనే కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.