మానవ అక్రమ రవాణా గ్యాంగ్ అరాచకం : అమెరికా పంపిస్తామని చెప్పి.. ఇండోనేషియాలో కిడ్నాప్, ఆపై లక్షల్లో డిమాండ్

పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల అశుతోష్ రాణా ఇండోనేషియాలోని బాలిలో కిడ్నాప్ అయ్యాడు.అతనిని విడుదల చేయాలంలే రూ.30 లక్షలు డిమాండ్ చేశారు కిడ్నాపర్లు.ఓ బంధువు ఇండోనేషియా, మెక్సికోల మీదుగా అక్రమంగా అమెరికాకు చేరుకోవడంతో.

 Punjab Youth Kidnapped In Bali Human Trafficking Gang Demands Rs 30 Lakhs Detail-TeluguStop.com

బెహ్లోల్‌పూర్‌కు బాధితుడి కుటుంబం కూడా తమ బిడ్డను అగ్రరాజ్యానికి పంపాలనుకుంది.దీనిలో భాగంగా బాధితుడు గతేడాది సెప్టెంబర్ 29న బాలి చేరుకున్నాడు.

ఆ తర్వాత వీరి కుటుంబానికి కిడ్నాపర్ల నుంచి కాల్స్ రావడం మొదలైంది.తనతో పాటు పంజాబ్‌కే చెందిన ముగ్గురు వ్యక్తుల్ని కూడా కిడ్నాప్ చేసి గదిలో బంధించారని అశుతోష్ రాణా ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలిపాడు.

కిడ్నాప్‌కు గురైన వారిని చమ్‌కౌర్ సాహిబ్ (సనౌర్), పాటియాలకు చెందిన మరొకరు, మొహాలికి చెందిన బాధితుడి బంధువుగా గుర్తించారు.కిడ్నాపర్లు యువకులను తీవ్రంగా హింసిస్తున్నారని.యువకులను కొట్టి, వారి వేళ్ల నుంచి గోళ్లను తీసివేసినట్లు బాధితుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.కిడ్నాపర్లు చెప్పిన విధంగా లూథియానాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలో రూ.24 లక్షలు జమ చేసింది బాధితుడి కుటుంబం.అయితే గుర్తుతెలియని వ్యక్తులు జలంధర్‌లో డబ్బు విత్ డ్రా చేసినట్లుగా తెలుస్తోంది.

నిందితులు ఇండోనేషియాలో నివసిస్తూ.విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని సమాచారం.ఆపై వారిని కిడ్నాప్ చేసి డబ్బు దోచుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu Ashutosh Rana, Bali, Rs Lakhs, Gang, Indonesia, Jalandhar, Kidnap, Manjee

తొలుత విద్యార్ధులను అమెరికా పంపుతామని చెప్పి.ఎలాంటి డబ్బు డిమాండ్ చేయరు.విద్యార్ధి యూఎస్‌కు చేరుకున్న తర్వాత డబ్బులు ఇస్తే చాలని తల్లిదండ్రులకు హామీ ఇస్తారు.

విమాన టిక్కెట్లు కూడా వారే పంపిస్తూ వుండటంతో వారిని పట్టుకోవడం కష్టంగా వుందని పోలీసులు చెబుతున్నారు.రాణా తరహాలోనే మరో ఏడుగురు వ్యక్తులు మోసపోయినట్లు అతని మేనమామ మంజీత్ రాణా తెలిపారు.

దీంతో వీరి కుటుంబ సభ్యులు మొహాలీలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఖరార్‌కు చెందిన ఓ వ్యక్తి, జలంధర్‌లోని కొందరు ట్రావెల్ ఏజెంట్లు, అమృత్‌సర్‌లోని పలువురు ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ ముఠాలో పాత్రధారులుగా తెలుస్తోంది.

అయితే డబ్బు ముట్టడంతో ముగ్గురు యువకులను కిడ్నాపర్లు విడుదల చేసినట్లుగా సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube