. వైరల్‌ : దేశంలోనే ఇతడు స్పెషల్‌... ఇంట్లోనే 9 ఓట్లుంటే ఎన్నికల్లో 5 ఓట్లే దక్కించుకున్న అభ్యర్థి  

Punjab Parliament Candidate Cries After Getting Only 5 Votes-jalandhar Parlment Indipendent Candidate,punjab Parliament Candidate,telugu Viral News,ఇండిపెండెంట్‌

పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. నిన్న ఫలితాలు కూడా వచ్చాయి. అనూహ్యంగా ఎన్డీయే కూటమి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది..

. వైరల్‌ : దేశంలోనే ఇతడు స్పెషల్‌... ఇంట్లోనే 9 ఓట్లుంటే ఎన్నికల్లో 5 ఓట్లే దక్కించుకున్న అభ్యర్థి-Punjab Parliament Candidate Cries After Getting Only 5 Votes

నరేంద్ర మోడీ సొంత బలంతోనే మరోసారి ప్రధాని అయ్యాడు. ఈ ఎన్నికల్లో అనేక సిత్రాలు, విచిత్రాలు కనిపించాయి. కొందరు ఎంతో ఫేమస్‌ అయ్యారు.

మరి కొందరు హీరోల స్థాయి నుండి జీరోకు పడి పోయారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు కూడా కొందరు మీడియాలో తెగ హల్‌ చల్‌ చేశారు. ముఖ్యంగా ఒక పచ్చ చీర అధికారిణి ఏ స్థాయిలో సోషల్‌ మీడియాలో స్టార్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎన్నికల్లో భాగంగా చివరిగా వైరల్‌ అయిన వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.

మూడు నెలల పాటు సుదీర్ఘంగా ఇండియాలో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు నెలల్లో ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగి వైరల్‌ అయ్యాయి. ఎన్నికల పక్రియ ముగిసిన నిన్న చివరిగా ఒక సంఘటన వైరల్‌ అవుతోంది.

అదే పంజాబ్‌లోని ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థికి సంబంధించిన విషయం. పంజాబ్‌లోని జలంధర్‌ పార్లమెంటు నియోజక వర్గంలో ఒక వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు. అతడు గెలుపు కోసం చాలా ప్రయత్నించాడు..

అయితే ఆయన గెలుపు సాధ్యం కాదని అంతా భావించారు. కాని ఓట్లను చీల్చుతాడేమో అంటూ స్థానికులు భావించారు. కాని అతడికి అనూహ్యమైన ఫలితం దక్కింది.

ఆ వ్యక్తికి కేవలం 5 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన ఇంట్లో ఉండే వారే 9 మంది. ఇక బంధువులు, స్నేహితులు అంతా కలిసి కనీసం 250 మంది ఉంటారు. ఆ ఓట్లకు మరి కొన్ని వచ్చి కనీసం వెయ్యి ఓట్లు అయినా వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అయిదు ఓట్లు మాత్రమే రావడం ఆశ్చర్యంగా ఉంది. 9 మంది ఇంట్లో ఉంటే కనీసం ఇంట్లో వారు కూడా ఆయనకు ఓట్లు వేయలేదు. ఇలాంటి దారుణమైన ఫలితం రావడంతో అతడు కౌంటింగ్‌ కేంద్రం వద్దనే కన్నీరు మున్నీరు అయ్యాడు.

తన ఇంట్లో వారు కూడా తనను కాదన్నారు. అంటూ కింద పడిమరీ కన్నీరు పెట్టాడు..

ప్రస్తుతం ఇతడికి వచ్చిన ఓట్ల గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మరి కొందరు ఈవీఎంలలో ఏదో జరిగిందనేందుకు ఇది కూడా ఒక నిదర్శణం అంటూ ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఎన్నికల పక్రియ ముగింపు రోజు జరిగిన ఈ సంఘటన వైరల్‌ అవుతోంది.