కరోనాపై పోరు: ఎన్ఆర్ఐ దాతృత్వం, ఆసుపత్రికి వెంటిలేటర్లు విరాళం  

Punjab Nri Donates Ventilators Hospitals - Telugu Civil Hospital, Hoshiarpur, Nri, Punjab, Punjab Based Nri Donates Ventilators To Civil Hospital In Hoshiarpur

కరోనాను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు ఎంతగానో కష్టపడుతున్నాయి.ఆర్ధిక నష్టాలు చుట్టుముడుతున్నా, ప్రజల ప్రాణాల కోసం కోసం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో పాటు అనేక ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

 Punjab Nri Donates Ventilators Hospitals

అయితే పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్ధలు ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నాయి.పేదలకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది రూపాయలను విరాళంగా అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ ప్రవాస భారతీయుడు ఓ ఆసుపత్రికి వెంటిలేటర్లు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు.

కరోనాపై పోరు: ఎన్ఆర్ఐ దాతృత్వం, ఆసుపత్రికి వెంటిలేటర్లు విరాళం-Telugu NRI-Telugu Tollywood Photo Image

దుబాయ్‌లో స్థిరపడిన సర్బాత్ డా బాలా ఛారిటబుల్ ట్రస్ట్ చీఫ్ ట్రస్టీ డాక్టర్ ఎస్‌పీ సింగ్ ఒబెరాయ్ కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు.

దీనికి తోడు భారతదేశంలో వైద్య సౌకర్యాల లేమి తదితర అంశాలు సర్బాత్‌ను తీవ్రంగా కలచివేశాయి.ఈ నేపథ్యంలో హోషియార్పూర్‌ సివిల్ ఆసుపత్రికి రూ.12 లక్షలు విలువ చేసే రెండు వెంటిలేటర్లను ఆయన ఆసుపత్రి వైద్యులకు అందజేశారు.సర్బాత్ పెద్ద మనసుకు నగర డిప్యూటీ కమీషనర్ అప్నీత్ రియాట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

మంచి వైద్యం అందజేయడానికి ఈ వెంటిలేటర్లు ఉపయోగపడతాయని ఆమె ప్రశంసించారు.

ఈ సందర్భంగా సర్భాత్ మాట్లాడుతూ.కరోనా మహమ్మారితో భారతదేశం పోరాడుతున్న సమయంలో ప్రభుత్వాలకు, ప్రజలకు సహకరించడం స్వచ్ఛంద సంస్ధల కర్తవ్యమని ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు.తన ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, సివిల్ ఆసుపత్రులకు 20 వేల పీపీఈ కిట్లు, 20 వేల ఎన్ 95 మాస్క్‌లు, శానిటైజర్లు, 10 లక్షల మూడు లేయర్ల మాస్క్‌లు అందజేసినట్లు ఒబెరాయ్ చెప్పారు.

భవిష్యత్తులో కూడా ఏదైనా వైద్య పరికరాలను అందించడానికి సర్బాత్ డా భాలా ఛారిటబుల్ ట్రస్ట్ సిద్దంగా ఉందని జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన హామీ ఇచ్చారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Punjab Nri Donates Ventilators Hospitals Related Telugu News,Photos/Pics,Images..