ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా డాన్స్ చేసారో చూడండి..!

ఈ చిత్రంలో కనిపిస్తున్న సీన్ ఏదో డాన్స్ ప్రోగ్రాం లోది అనుకుంటే మీరు పొరపడ్డట్టే.ఈ చిత్రంలో కనిపించే వారు హీరోలు, అగ్రనటులు అనుకున్నా.

 Punjab New Elected Cm Charanjit Singh Channy Dance For Traditional Bhangra Dance In An Event-TeluguStop.com

మీరు పప్పులో కాలేసినట్లే.ఇంతకీ తెగ వైరల్ అవుతున్న ఈ చిత్రంలో కనిపించేది ఎవరో గుర్తుపట్టారా.? ఆయన మరెవరో కాదు.సాక్షాత్తు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ! ఆశ్చర్యపోయారు కదూ.ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అగ్రనేతలు డాన్స్ చేయడం చూశాం కానీ ఓ ముఖ్యమంత్రి అదరగొట్టే స్టెప్పులేయడం ఎప్పుడూ చూడలేదు.దాంతో చరణ్‌జిత్‌ డాన్స్ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే అతన్ని పంజాబ్ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఏకగ్రీవంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.దాంతో ఆయన సెప్టెంబర్ 19 వ తేదీన కొత్త సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించారు.

 Punjab New Elected Cm Charanjit Singh Channy Dance For Traditional Bhangra Dance In An Event-ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా డాన్స్ చేసారో చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ క్షణం నుంచి ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవి దక్కడంతో ఆయనలో ఉత్సాహం ఉరకలేస్తోంది.

తాజాగా కపుర్తాలాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.తరువాత ఆనందంతో స్టేజీ మీద బాగా సందడి చేశారు.ఈ క్రమంలోనే ‘భాంగ్రా డ్యాన్స్‌’ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Telugu Cm, Cm Charanjit Singh Channy, Dance, Punjab Cm Dance, Punjab New Elected Cm, Social Media, Traditional Bhangra Dance, Viral, Viral Latest, Viral News-Latest News - Telugu

58 ఏళ్ల వయసులోనూ ఆయన కుర్రాడిలా చిందులు వేస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా అలాగే కన్నార్పకుండా చూసేశారు.దాదాపు ఆరు పదుల వయసులోనూ ఈ రేంజ్ లో ఎనర్జీతో అతను కాలు కదిపి అనేక చర్చలకు కేంద్రబిందువు అయ్యారు.ఇతను సంప్రదాయ నృత్య కారులు డాన్స్ వేస్తుండగా వారితోపాటు డాన్స్ చేశారు.

ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.‘పోనిలే పాపం! కొత్తగా సీఎం అయ్యాడు.ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండాలిలే’ అని సటైర్లు పేలుస్తున్నారు.

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ సీఎంగా రాజీనామా చేయక ముందు చరణ్‌జిత్‌ కేబినెట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.

#CmCharanjit #Punjab Cm #Punjab Cm #Dance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు