దాచుకోవాల్సిన చోట దోచుకున్నాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు ...!

విజ్ఞానం పెరుగుతున్న తరుణంలో నేరాలు మితిమీరిపోతున్నాయి.ఒకప్పుడు దారి దోపిడీలు, ముఠా దోపిడీలు చూసాము.

 Finally Found Bank Scammer By Police, Punjab National Bank, Saroor Nagar, Lingoj-TeluguStop.com

కానీ ఇప్పుడు తెలివి పెరిగి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.ఇక బ్యాంకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

దాచుకునే చోట దోచుకుంటున్నారు.అదేనండి బ్యాంకులు, మధ్యతరగతి కుటుంబాలు తమ చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడానికి కడుపు కాల్చుకొని ఎంతో కొంత సొమ్ము బ్యాంకులో పొదుపు చేసుకుంటూ బతుకుతున్నారు.

కానీ చాలా మంది బడా బాబులు వాటిని మోసం చేస్తూ బ్యాంకులు దివాలా తీసేలా చేస్తున్నారు.ఇలాంటి పనులు వలన ముఖ్యంగా మధ్యతరగతి బతుకులు చిరిగి పోతున్నాయి.

హైదరాబాద్ నగరంలో ఘరానా మోసగాడు రూ.2.90 కోట్ల ను బ్యాంకుల నుంచి రుణంగా పొందాడు.నకిలీ పత్రాలు చూపించి ఈ విధంగా బ్యాంకును మోసం చేస్తూ వచ్చాడు.

ఇతను కథేంటో చూద్దామా… ఇతరుల స్థలాన్ని తనదేనని నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి ప్రాణం తీసుకున్న వ్యక్తిని సిసిఎస్ ప్రత్యేక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలంలో లింగోజిగూడ లో తన పేరిట ఉన్న 10,540 గజాల స్థలాన్ని నిమ్మగడ్డ రాజా గిరిధర్ కుమార్, మరో ముగ్గురికి 2005 సంవత్సరంలో విక్రయించాడు.

గిరిధర్ కుమార్ ఆ స్థలాన్ని తన కుమార్తెకు గిఫ్టుగా రాశాడు.లావాదేవీలు వ్యవహారంలో కర్నూలుకు చెందిన వెంకటశివారెడ్డి, మరో ముగ్గురు స్థలానికి సంబంధించిన పత్రాలను తమ పేరిట మార్చుకున్నారు.

Telugu Kurnool, Lingoji Guda, Frauds, Punjabnational, Saroor Nagar-General-Telug

2018 లో ఆ పత్రాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నానల్ నగర్ బ్రాంచిలో తనఖా పెట్టి మెసర్స్ ఈగర్బర్గ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట రూ.2.90 కోట్లు రుణం తీసుకున్నారు.కంపెనీని మూసేసి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు వై.వెంకట శివా రెడ్డిని శుక్రవారం అదుపులోకి తీసుకొని రిమాండకు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube