పంజాబ్ కింగ్స్ యువ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ సంచలన ప్రదర్శనకు విలవిలలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 34 పరుగులతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.శుక్రవారం జరిగిన ఆ మ్యాచ్‌లో హర్‌ప్రీత్ ముందుగా బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్‌కు అండగా నిలిచి ఆ తర్వాత బౌలింగ్‌లో మాయ చేశాడు.
ఔటాఫ్ సిలబస్‌లా దూసుకొచ్చి ఆర్సీబీ బలం, బలగమైన విరాట్ కోహ్లీ (35), గ్లెన్ మాక్స్వెల్ (0), ఏబీ డివిలియర్స్ (3)ను పెవిలియన్ చేర్చాడు.ఇక విరాట్, మ్యాక్సీని వరుస బంతుల్లో ఔట్ చేయడం విశేషం.
తమ ప్రణాళికల్లోనే లేని హర్‌ప్రీత్ బ్రార్ సంచలన్ పెర్ఫామెన్స్‌కు ఆర్సీబీ తెల్లమొహం వేసింది.
ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఈ యువ స్పిన్నర్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ కూడా దక్కింది.
ఈ సంచలన ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన హర్‌ప్రీత్ బ్రార్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు.ఈ క్రమంలోనే ఓ వారం క్రితం అతను చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై ఈ పంజాబ్ బౌలర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.హర్‌ప్రీత్ బ్రార్‌ను చూసి ఓ నెటిజన్.‘సింగ్ ఈజ్ బ్లింగ్‘ సినిమాలోని అక్షయ్ కుమార్‌లానే ఉన్నావని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశాడు.2015లో వచ్చిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సిక్కు కుర్రాడి పాత్ర పోషించాడు.వారిలానే టర్బన్(తలపాగ) ధరించాడు.అయితే అభిమాని కామెంట్‌కు చిర్రుత్తుకుపోయిన హర్‌ప్రీత్ బ్రార్.ఆ కామెంట్ స్క్రీన్ షాట్ చేస్తూ మరీ ఆగ్రహంగా ట్వీట్ చేశాడు.తాను డబ్బుల కోసం టర్బన్ ధరించననే ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు.
అంతేకాకుండా రైతు ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు.ఆ మధ్య రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా అక్షయ్ కుమార్ తన గళాన్ని వినిపించిన విషయం తెలిసిందే.