ఇకనుండి ట్యాక్స్ కట్టి భూమిలోని నీటిని వాడుకోవలసి ఉంటుంది... ఆ ప్రభుత్వం జీవో జారీ!

అదేంటి? భూమిలోని నీటిని వాడుకోవానికి ట్యాక్స్ లు కట్టాలా? ఇంకా మనం ఏ కాలంలో వున్నాం.రాజులు, బ్రిటీషర్లకు కాలం చెల్లింది కదా! అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండీ.ఇలాంటి పన్నుల గురించి పుస్తకాల్లో చదువుకున్నాం కానీ, ఎపుడు చూడలేదు అని అంటారా? అయితే ఇపుడు చూడండి మరి.అవును, ప్రస్తుతం మళ్లీ అలాంటి రోజులు వస్తున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.నిత్యం పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజలు బతకడానికే దిక్కు లేకుండా పోయింది.

 Punjab Government Laid Taxes On Ground Water Extraction Details, Tax,paying, Wat-TeluguStop.com

Telugu Farmers, Ground, Groundwater Tax, Punjab, Taxes Ground, Latest-Latest New

ఒక పూట తిని రెండో పూట నీరు తాగి కడుపు నింపుకొని పేదవారు ఎందరో వున్నారు ఈ ప్రపంచంలో.అలాంటి వారికి కూడా ప్రభుత్వాలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.అవును, తాజాగా పంజాబ్‌లోని భగవంత్ మాన్ సర్కార్ రైతులకు, ఇతర వర్గాలకు షాకిచ్చింది.

భూమిలోంచి నీటిని తోడితే పన్ను చెల్లించాలని హుకుం జారీచేసింది.ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

దీనికి సంబంధించి పంజాబ్ రాష్ట్ర నీటి నియంత్రణ, అభివృద్ధి యంత్రాంగం తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేయడం కొసమెరుపు.

Telugu Farmers, Ground, Groundwater Tax, Punjab, Taxes Ground, Latest-Latest New

ఇదేంట్రా భగవంతుడా అని ప్రశ్నిస్తే, భూగర్భ జలాన్ని కాపాడేందుకు అలా చేయక తప్పలేదని సదరు ప్రభుత్వం చెప్పడం గమనార్హం.అయితే ఓ విషయంలో మాత్రం చిన్న వెసులుబాటు కల్పించింది ఆ సర్కార్.వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు వినియోగిస్తే ఎలాంటి పన్ను విధించబోమని, అలా కాకుండా పెళ్లిళ్లకు, పబ్బాలకు, గృహ నిర్మాణాలకు తదితర అవసరాలకు ఇబ్బుడిముబ్బడిగా నీటిని వృధా చేస్తే ఊరుకోబోమని, అవసరమైన జలానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇలాంటి అవసరాలకు భూగర్భ జలాల్ని వాడుకోవాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube