ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ఎక్కడంటే.. ?

కరోనా ఈ పేరు మరోసారి ఎక్కువగా ప్రజల నోటిలో నానుతుంది.దీనికంతటికి కారణం ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే.

 Punjab Government Decided To Close Schools Upto 31st March Due To Corona ,  Punj-TeluguStop.com

ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా కూడా అడుగులు కూడా వేశాయి.

ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.అయితే వైద్య, నర్సింగ్ కళాశాలలను మాత్రం మూసివేయడం లేదని వెల్లడించింది.

అదీగాకుండా కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొంటూ కొన్ని ఆంక్షలు విధించింది.

సినిమా హాళ్లలో సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలని, షాపింగ్ మాల్స్ లో 100 మందికి మించి ఉండరాదని, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 మంది వరకే అనుమతిస్తామని స్పష్టం చేసింది.

ఇకపోతే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేయడమే కాకుండా, అదనంగా మరో రెండు గంటల పాటు పొడిగించాలని నిర్ణయించింది.మొత్తానికి కరోనా కట్టడి విషయంలో పంజాబ్ ప్రభుత్వం మాత్రం సీరియస్‌గా ఉందని అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube