రంగంలోకి ‘‘Chief Minister’s Field Officers’’... ఎన్ఆర్ఐలకి లేదిక ఢోకా : పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ప్రవాస భారతీయులకు అత్యంత ప్రాధాతన్యతనిచ్చే రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే.

 Punjab Cm Bhagwant Mann Decided To Appoint Chief Ministers Field Officers As No-TeluguStop.com

పంజాబీలు పలు దేశాలకు వలస వెళ్లారు.విదేశాల్లో వున్నప్పటికీ మాతృభూమి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

అంతేకాదు.పంజాబ్ రాజకీయాలను, సంస్కృతిని అత్యంత ప్రభావితం చేయగల స్థాయిలో ఆ రాష్ట్ర ఎన్ఆర్ఐలు వున్నారు.

అయితే ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండటంతో స్వరాష్ట్రంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రవాస భారతీయుల సమస్యలపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్ఆర్ఐల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా ఫీల్డ్ ఆఫీసర్‌లను నోడల్ అధికారులుగా నియమించాలని సీఎం నిర్ణయించారు.

ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.సహాయ కమీషనర్ (గ్రీవెన్స్)కు సమాన సంఖ్యలో వున్న పోస్టులను రద్దు చేసి ‘‘ముఖ్యమంత్రి ఫీల్డ్ ఆఫీసర్‌ల’పేరిట 23 పోస్టులను ఏర్పాటు చేశారు.

పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అందించడం వల్ల జిల్లా స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.సీఎం కార్యాలయంతో నేరుగా కమ్యూనికేట్ చేయడంతో పాటు శాఖలు, జిల్లాల వారీగా సమన్వయం చేయగల ఈ అధికారులు .ఎన్ఆర్ఐలకు ఆదర్శ నోడల్ అధికారులుగా పేరు తెచ్చుకుంటారని భగవంత్ మాన్ ఆకాంక్షించారు.ఈ ఏర్పాటు ద్వారా ఎన్ఆర్ఐలు.

తమ సమస్యలన్నింటికీ సజావుగా, అవాంతరాలు లేని రీతిలో పరిష్కారాలను పొందుతారని భగవంత్ మాన్ అన్నారు.

ఇకపోతే.

గత నెలలో ఎన్ఆర్ఐ శాఖ సీనియర్ అధికారులతో ఆ రాష్ట్ర మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కొత్త ఎన్ఆర్ఐ ముసాయిదాపై సీనియర్ అధికారులు, పంజాబ్ ఎన్ఆర్ఐ కమీషన్ సభ్యుల నుంచి పలు సూచనలు స్వీకరించారు.

అనంతరం ధాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.పంజాబీ ఎన్ఆర్ఐ యువతను వారి మూలాలతో అనుసంధానం చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.

Telugu Bhagwant Mann, Field Officers, Kuldeepsingh, Nri Draft, Nodalofficers, Nr

అలాగే తమ ప్రభుత్వం వృద్ధుల కోసం ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించనుందని చెప్పారు.దీని కింద వృద్ధులైన పంజాబీ ఎన్ఆర్ఐలకు రాష్ట్రంలో మతపరమైన , చారిత్రక ప్రదేశాలకు ఉచిత ప్రయాణం అందిస్తారు.అలాగే.సివిల్ లోక్‌ అదాలత్‌ల తరహాలో సమస్యల పరిష్కారానికి ఎన్ఆర్ఐ లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని కుల్‌దీప్ ధాలివాల్ తెలిపారు.ఈ కోర్టులలో భూమి, వివాహ వివాదాలను పరస్పర అంగీకారంతో అక్కడికక్కడే పరిష్కరిస్తామని.దీనికి చట్టపరమైన గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube