చెక్కతో సైకిల్ తయారీ.. ఎలా అంటే?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.గడిచిన 8 నెలల నుంచి కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది.

 Punjab Carpenter Crafts Wooden Bicycle, Coronavirus, Lock Down, Punjab, Dhanram-TeluguStop.com

ఇప్పట్లో వైరస్ ఉధృతి ఆగేలా కనిపించడం లేదు.భారత్ లో గత కొన్ని రోజులుగా 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా గడిచిన 24 గంటల్లో 95 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కరోనా, లాక్ డౌన్ వల్ల కోట్ల సంఖ్యలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల గతంలో ఎప్పుడూ దొరకని విధంగా ఫ్రీ టైమ్ దొరుకుతుండటంతో కొందరు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు.

ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదని భావించి తమ తెలివితేటలతో కొత్త వస్తువులను తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 40 సంవత్సరాల ధనరామ్ సాగు లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉన్నాడు.

అయితే ఇంట్లో ఉండటం వల్ల తన జీవితంలో విలువైన సమయం వృథా అవుతోందని భావించిన ధనరామ్ సాగు పర్యావరణానికి అనుకూలంగా ఉండే సైకిల్ ను కలపతో తయారు చేశాడు.ధనరామ్ తయారు చేసిన సైకిల్ సోషల్ మీడియాలో వార్తల్లోకెక్కింది.

అతను సైకిల్ తయారు చేయడంలో చూపిన ప్రతిభను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.దేశ విదేశాల నుంచి తమకు కూడా అలాంటి సైకిళ్లు కావాలని ఆర్డర్లు రావడంతో ధనరామ్ చేతి నిండా పనితో బిజీ అయిపోయాడు.

రెండు సార్లు చెక్క సైకిల్ ను తయారు చేయడంలో విఫలమైన ధనరామ్ మూడో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.ఈ సైకిల్ 15,000 రూపాయల ధర పలకగా సైకిల్ తయారు చేయడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని తెలుస్తోంది.

ధనరామ్ సైకిల్ కోసం కెనడా దేశం నుంచి ఆర్డర్ రావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube