పంజాబ్ ఎన్నికల విషయంలో సరికొత్త ట్విస్ట్..??

త్వరలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.జరగబోయే ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.

 Punjab Assembly Elections May Be Postpone Aap, Congress, Election Commission-TeluguStop.com

ఐదు రాష్ట్రాలలో ఒకటైన పంజాబ్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

కానీ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉండటంతో మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది.పరిస్థితి ఇలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మేటర్ లోకి వెళ్తే ఫిబ్రవరి 16వ తారీకు గురు రవిదాస్ జయంతి సందర్భంగా.పంజాబ్ రాష్ట్రంలో 30 శాతం షెడ్యూల్డ్ కులాల జనాలు… వారం రోజుల ముందే యూపీ సందర్శించనున్నారు.

ఈ పరిణామంతో పంజాబ్ రాష్ట్రంలో అందరూ ఓటు వేసే అవకాశం ఉండదు.ఈ నేపథ్యంలో ఒక వారం పాటు ఎన్నికలు వాయిదా వేయాలంటూ పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ ఎన్నికల కమిషన్ ని కోరారు.

ఇదే తరుణంలో పంజాబ్ లో విపక్షాలు కూడా ఇదే డిమాండ్ తెర పైకి తీసుకు వస్తున్నాయి.అన్ని పార్టీలు కోరుతూ ఉండటంతో ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 14 న జరగాల్సిన.

ఎన్నికలు వారం రోజుల తర్వాత జరిపించి ఆలోచన చేస్తున్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి.

Punjab Assembly Elections May Be Postpone AAP, Congress, Election Commission - Telugu Congress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube