Puneeth Rajkumar Kantara: కాంతార మూవీ క్లైమాక్స్ లో పునీత్.. ఫోటోలు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే!

కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.కాంతార సినిమాలో రిషబ్ శెట్టి ఊరమాస్ పర్ఫామెన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.

 Puneeth Rajkumar Kantara Pic Goes Viral In Social Media Details Here , Puneeth R-TeluguStop.com

కాంతార మూవీని ఎన్నిసార్లు చూసినా ఆ సినిమా బోర్ కొట్టడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో మొదట పునీత్ రాజ్ కుమార్ ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయి.

అయితే కాంతార మూవీ క్లైమాక్స్ లో పునీత్ కనిపిస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన చాలామంది అభిమానులకు ఉంది.అయితే పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఒకరు కాంతార మూవీ పోస్టర్లను ఎడిటింగ్ చేసి రిషబ్ శెట్టికి బదులుగా పునీత్ కనిపించేలా చేశారు.

వైరల్ అవుతున్న పోస్టర్లలో పునీత్ రాజ్ కుమార్ ను చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.పునీత్ కనిపించిన కాంతార పోస్టర్ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాంతార మూవీ పెట్టుబడితో పోల్చి చూస్తే 25 రెట్ల కలెక్షన్లను సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో బడ్జెట్ పరంగా చూస్తే ఈ సినిమ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

కాంతార మూవీ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.త్వరలో వరాహరూపం సాంగ్ అన్ని వెర్షన్లలో అందుబాటులోకి రానుంది.

Telugu Hombale, Kantara, Rishab Shetty, Tollywood-Movie

బుల్లితెరపై కాంతార మూవీని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.బుల్లితెరపై ఈ సినిమా ప్రసారమైన సమయంలో రేటింగ్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.కాంతార మూవీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube