పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు సీసీటీవీ ఫుటేజ్ వైరల్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చింది.ఆయన మరణ వార్త సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసింది.

 Puneeth Raj Kumar Last Moments Cctv Footage Goes Viral , Punith Raj Kumar, Passe-TeluguStop.com

ఎప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండే పునీత్ ఒక్కసారిగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లడం అనేది చాలా బాధాకరమైన విషయం.అయితే పునీత్ మరణవార్త విన్న ఎంతోమంది అభిమానులు గుండెలవిసేలా రోదించారు.

కొంతమందికి అయితే పునీత్ మరణవార్త విని గుండెలు ఆగిపోయాయి.పునీత్ హాస్పిటల్ పాలయ్యారు అని తెలియగానే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ఇక శుక్రవారం రోజున అతను ఉదయాన్నే వ్యాయామం చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.అనంతరం అతని కుటుంబసభ్యులు అతనిని ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇలా అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనలను ఇప్పటికీ పునీత్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా నమ్మడం లేదు.ఇప్పటికీ ఆయన చనిపోయి ఆరు రోజులు అవుతున్న అతను మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

గుండె నొప్పి వచ్చిన తర్వాత తన భార్య అశ్వినితో కలసి డాక్టర్ రమణ రావు ఇంటికి వెళ్లారు.ఈసీజి వరకూ చాలా యాక్టివ్ గా ఉన్నారు పునీత్.

ఈసీజీ రిపోర్ట్ లో వచ్చిన ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు రమణారావు.వారి ఇంటి నుంచి తన కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కాడు పునీత్.

ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోని చూసి కొందరు అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube