భార్యకు హెచ్‌ఐవీ వైరస్‌ ఎక్కించాడు.. సంవత్సరం తర్వాత ఆమెకు తెలిసింది, ఆ తర్వాత ఏమైందో తెలుసా?  

భార్య భర్తల మద్య గొడవలు, కొట్లాటలు చాలా కామన్‌. అయితే క్షణికావేశంలో కొందరు హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో కాస్త సంయమనం పాటిస్తే గొడవ పెద్దది కాకుండా ఉంటుంది.

Woman Says Doctor Husband 'injected' Her With HIV-infected Saline-Hiv-infected Saline Pune Women

Woman Says Doctor Husband 'injected' Her With HIV-infected Saline

కాని కొందరు మాత్రం ఆ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మొత్తం జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా పూణెకు చెందిన ఒక వ్యక్తి తన భార్యతో జరిగిన గొడవ కారణంగా జీవితంలోనే పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు అతడి భార్యతో పాటు, అతడి జీవితాన్ని కూడా నాశనం చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్ర పూణెకు చెందిన ఒక హోమియోపతి డాక్టర్‌ 2015లో వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు ఈ డాక్టర్‌ అదనపు కట్నం కోసం వేదించడం మొదలు పెట్టాడు. ఆమె కుటుంబ సభ్యులు ఆర్థికంగా లేని కారణంగా అదనపు కట్నం ఇచ్చుకోలేమని చెప్పారట. దాంతో ఆగ్రహించిన సదరు డాక్టర్‌ 2017వ సంవత్సరంలో భార్యతో తీవ్రంగా గొడవ పడ్డాడు.?

Woman Says Doctor Husband 'injected' Her With HIV-infected Saline-Hiv-infected Saline Pune Women

ఆ సమయంలోనే ఆమెకు అనారోగ్యం చేసింది. అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకునేందుకు ఆమెకు హెచ్‌ఐవీ వైరస్‌ను ఎక్కించాడట. సెలయిన్‌ ద్వారా హెచ్‌ఐవీని ఎక్కించిన సదరు డాక్టర్‌ తిరిగి భార్యతో మామూలుగా ఉంటూ వచ్చాడు.

ఈమద్య కాలంలో భార్యకు మళ్లీ అనారోగ్యం చేయడంతో పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెకు హెచ్‌ఐవీ ఉందని తేలింది. సంవత్సరం తర్వాత ఆమెకు ఐహెచ్‌ఐవి విషయమై వెళ్లడి కావడంతో ఆమె లబోదిబో మంది. తన భర్తకు కూడా హెచ్‌ ఐవీ టెస్టు చేయించాలని ఆమె పట్టుబట్టింది. అయితే అతడికి హెచ్‌ ఐ వీ లేకపోవడంతో తన భర్త కావాలని తనకు హెచ్‌ ఐ వీ వైరస్‌ ఎక్కించాడని నిర్ణయానికి వచ్చింది.

Woman Says Doctor Husband 'injected' Her With HIV-infected Saline-Hiv-infected Saline Pune Women

గత కొంత కాలంగా తన భర్త తనకు దూరంగా ఉంటున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. భర్త దూరంగా ఉంటుండటంతో అనుమానం వచ్చిందని, ఇప్పుడు ఆయన హెచ్‌ఐవీ వైరస్‌ ఎక్కించాడు కనుక దూరంగా ఉంటూ వస్తున్నాడని అనుమానం వ్యక్తం చేసింది. భర్తపై కేసు పెట్టిన భార్య ప్రస్తుతం అతడి నుండి విడాకులు కోరుతుంది. హెచ్‌ఐవీ వైరస్‌ ఎక్కించినందుకు గాను అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.